నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల్లోనే ఈ సినిమా ఫార్ములాకు చాలా దగ్గరగా వచ్చింది. మరి ఈ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 6.74 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.83 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.64 కోట్లు , ఈస్ట్ లో 64 లక్షలు , వెస్ట్ లు 61 లక్షలు , గుంటూరులో 78 లక్షలు , కృష్ణ లో 84 లక్షలు , నెల్లూరులో 52 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 3 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.60 కోట్ల షేర్ , 21.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 3 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 3.55 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 7.55 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 3 రోజులకు గాను ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 24.70 కోట్ల షేర్ , 45.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 17.30 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: