తమిళ ఇండస్ట్రీ నుండి రాబోయే అతిపెద్ద సినిమాల్లో “కంగువ”  ఒకటి. సూర్య  ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్  ప్రతినాయకుడిగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్ గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండుసార్లు అనధికారికంగా వాయిదాపడి.. అక్టోబర్ 10కి విడుదలవుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే.. నిన్న వచ్చిన ఇండస్ట్రీ సమాచారం మేరకు ఈ చిత్రం అనుకున్నట్లుగా అక్టోబర్ 10కి విడుదలవ్వడం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రం విడుదల విషయంలో సందిగ్ధత రజనీకాంత్ తాజా చిత్రం “వేట్టాయన్”  అక్టోబర్ 10కి విడుదల అని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసినప్పటినుండి మొదలయ్యింది. అయితే.. దసరా సెలవులు కాబట్టి రెండు సినిమాలకు థియేటర్లు సరిపోతాయి అనుకున్నారు ట్రేడ్ వర్గాలు.కార్తీ మెయియాజహగన్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. రజనీకాంత్‌ను తమిళ చిత్రసీమలో ఎంతో ప్రముఖమైన వ్యక్తి అని.. ఆయన నటించిన వెట్టైయాన్‌, కంగువ సినిమాలను ఒకే రోజు విడుదల చేయడం ఉత్తమం కాదని సూర్య అన్నాడు.కంగువ అనేది బిడ్డలాంటిది.. సినిమా సృష్టిలో చాలా మంది వ్యక్తులు తమ రక్తం, చెమట, కన్నీళ్లను కురిపిస్తున్నారన్నాడు. సినిమా ఫైనల్‌గా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాన్ని అర్థం చేసుకొని.. మద్దతు ఇవ్వాలని అభిమానులు, మూవీ లవర్స్‌ను కోరాడు సూర్య .ఈ నేపథ్యంలో నే దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని దసరా పండుగకి కాకుండా,దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ మొత్తం హడావుడిలో లాభపడింది మాత్రం రజనీకాంత్ అని చెప్పాలి. ఆయన మునుపటి చిత్రం “లాల్ సలాం” ను పక్కనపెడితే.. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన “జైలర్”కు  దొరికినట్లుగా “వెట్టయాన్”కు కూడా సోలో రిలీజ్ దొరకడం, ఈ చిత్రంలో అమితాబ్ , ఫహాద్ ఫాజిల్ , రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషించడం,“జై భీమ్” దర్శకుడు టి.జె.జ్ఞానవేల్  దర్శకత్వం వహించడం వంటి కారణాల వల్ల సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒకవేళ “కంగువ”తోపాటుగా విడుదలయ్యుంటే మాత్రం కలెక్షన్స్ విషయంలో కాస్త దెబ్బ పడేది. ఇప్పుడు పోటీ లేకుండా సింగిల్ గా వస్తుండడంతో రజనీకాంత్ అండ్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నారంట. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: