జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై తారక్ అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి.అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రూపొందిస్తున్నారు చిత్రమేకర్స్. ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు. దేవర మొదటి పార్ట్ ను సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో అతని మెజెస్టిక్ మ్యాడ్‌నెస్‌ని చూసేందుకు రెడీ అవ్వండి అంటూ దేవరలోని తారక్ రెండు షేడ్స్ చూపిస్తూ అధికారక పోస్టర్ రిలీజ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాను దర్శకుడు కొరటాల పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ మూవీలోని మూడో సాంగ్‌కి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్   ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

'దేవర నుంచి థర్డ్‌ సింగిల్‌ దావుడి త్వరలోనే రిలీజ్ కానుంది. తారక్‌ అన్న, జాన్వీ కపూర్‌ దుమ్ములేపుతారు. కొరటాల శివ సర్ భారీ హిట్ కొడతారు' అని అనిరుధ్ రవిచందర్‌పోస్ట్ చేశారు. ఎన్టీఆర్-జాన్వీ మధ్య మాస్‌ డ్యుయెట్‌ ఉంటుందని అనిరుధ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చుట్టమల్లె కంటే బాగుండాలని కోరుకుంటున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కొంచెం నవ్వు, మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తున్న తారక్‌ లుక్ షేర్ చేశారు. అంతేగాక, ఈ పాటలో తారక్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని.. ఈ పాట ఎప్పుడొచ్చినా భీభత్సమే అని అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ‘దేవర’ మూవీలోని మూడో పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పాటలో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేయబోతున్నారని అర్ధమవుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ పాటను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం చాలా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: