తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చిరంజీవి 150 కన్నా ఎక్కువ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలలో నటించకుండా ఏవో కొన్ని చిత్రాలలో మాత్రమే నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.... చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో బ్రిటన్, జర్మనీ దేశాలకు చెందిన కార్లు కూడా చిరంజీవి వద్ద ఉన్నాయట. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ కారు చిరంజీవి గ్యారేజ్ లో ఉండడం విశేషం. అయితే చిరంజీవి తన మొదటి కారు మాత్రం తన సొంతంగా కొనుక్కోలేదట. ఈ విషయాన్ని చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మొదటి కారు గురించి తెలిపాడు. కెరీర్ మొదట్లో నా ఆరో సినిమాలవ్ యు చేస్తున్న సమయంలో ఆ నిర్మాత దగ్గర ఫియట్ కారు ఉండేది.


ఆ సినిమాలో బాగా యాక్టింగ్ చేసి నన్ను మెప్పిస్తే ఆ కారు నీకు గిఫ్ట్ గా ఇస్తానని ఆ నిర్మాత చెప్పారు. నేను ఎంతో కష్టపడి నటించాను. మరి నా యాక్టింగ్ నిర్మాతలకు నచ్చలేదేమో....ఆ కారు నాకు గిఫ్ట్ గా ఇవ్వలేదు. దీంతో నేను చాలా బాధపడ్డానని చిరంజీవి బాధపడ్డారు. అప్పుడు మా నాన్నగారు నేను సంపాదించిన నా డబ్బులతో తీసుకోకుండా ఆయన దాచుకున్న డబ్బులతో నాకు కారు కొనిచ్చారు. అదే నా మొదటి కారన్నారు చిరు.


అది ఫియట్ మోడల్ కారు. AAN 2087 దాని నెంబర్ అని తెలిపారు. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఉండేది. ఆ కార్ కొన్న దగ్గర నుంచి నేను దానిని చాలా ఇష్టంగా చూసుకునేవాడిని. నేను మాత్రమే డ్రైవింగ్ చేసేవాడిని. అది డ్రైవ్ చేస్తుంటే అందరూ మనల్నే చూస్తున్నారు అని అనుకునేవాడిని. డ్రైవర్ ఉన్నా కూడా ఎక్కువగా అతనికి ఇచ్చేవాడిని కాదు. మా అమ్మ నాన్న అప్పుడు నెల్లూరులో ఉండేవారు. నెల్లూరు, మద్రాస్ కి అమ్మానాన్నలు రావడానికి అదే కారును వాడేవాడిని. ఆ కారు ఉన్న సమయంలోనే నాకు వివాహం జరిగింది. నేను, సురేఖ కలిసి ఆ కారులో మద్రాస్ అంతా తిరిగే వాళ్ళం. సురేఖ కూడా ఆ కారును చాలా ఇష్టంగా చూసుకునేది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: