యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే బాల నటుడుగా అడుగుపెట్టి హీరో గానే మొదటి సినిమానే విజయం సొంతం చేసుకున్నాడు. 8 సంవత్సరాల వయసులోనే  బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు.  ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో వరల్డ్ వైడ్ ఫేమ్ ను కూడా సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.

అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు ఎన్టీఆర్ సినిమా వేడుక కోసం రైల్వే శాఖ 9 రైళ్ళను కేటాయించినట్లు, అలాగే ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సమాచారం.  జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా మ్యూజిక్ లాంచ్ జూనియర్ ఎన్టీఆర్ తన స్వగ్రామంలో నిర్వహించారు. ఈ వేడుక లో పాల్గొనేందుకు దాదాపు పది లక్షల మంది అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం ఏకంగా రైల్వే శాఖ తొమ్మిది ప్రత్యేక రైలు పలు బస్సులను నడిపింది. అప్పట్లో తారక్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఏకంగా 10 లక్షల మంది హాజరై అభిమానాన్ని చాటుకున్నాడు.  

అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా మ్యూజిక్ లాంచ్ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున అభిమానుల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తొక్కేసలాటలో ఒక అభిమాని చిక్కుకొని మృతి చెందాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే మృతి చెందిన కుటుంబానికి స్వయంగా కలుసుకొని ఐదు లక్షల రూపాయలు సహాయాన్ని అందజేసి ఇప్పటికి కూడా అభిమాన కుటుంబాన్ని ఎన్టీఆర్ ఆదుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: