ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాను. మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఎడతెరపీ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా కొన్నిచోట్ల వాగులు వంగలు పొంగిపొర్లు పోతున్నాయి. ఇక ముఖ్యమైన నగరాలలో అయితే కాలనీలు రోడ్లు చెరువుల లాగా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున కృష్ణపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటడంతో తెలుగు రాష్ట్రాలలో పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాలలో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.


ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులు ప్రజల కోసం పలు సూచనలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  చిరు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ “తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను”  ఇలా రాసుకోవచ్చారు. ఇక ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వరదలు పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనడంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కొందరు వరదలలో గలంతయి మృతి చెందారు కూడా. అలాగే ఇప్పటికే పలు ప్రాంతాలలో స్కూళ్లకు కూడా పిల్లలకు హాలిడేస్ కూడా ప్రకటించేశారు



మరింత సమాచారం తెలుసుకోండి: