గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె వంటి చిత్రాలతో డైరెక్టర్ క్రిష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ సినిమాలన్నీ మనసును హత్తుకుంటాయి. జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. క్రిష్ గొప్ప దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. వీటిని పూర్తిగా చూశాక మాటల్లో చెప్పలేనంత మంచి అనుభూతి కలుగుతుంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి పిరియడ్ డ్రామాతో కూడా క్రిష్ ఒక హిట్ కొట్టాడు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా భారీ హిట్ అవుతుందని చాలామంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే డైరెక్టర్ క్రిష్ ‘నా ఉఛ్వాసం కవనం’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు. ఈ ఈటీవీ ప్రోగ్రామ్‌లో క్రిష్ తనకు, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిపాడు. గమ్యం సినిమాకి సీతారామశాస్త్రి సాంగ్స్ రాశారని వెల్లడించాడు. అప్పట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక్కో సాంగ్ కు 2 లక్షల రూపాయలు తీసుకునే వారిని కానీ తమ గమ్యం సినిమాలోని ఆరు పాటలు రాసినందుకు ఒక్క పైసా కూడా తీసుకోలేదని చెప్పారు.

సాధారణంగా సీతారామశాస్త్రి ఒక పాట రాయడానికి ఆ మూవీ స్టోరీ మొత్తం వింటారు. "గమ్యం" స్టోరీ విన్న తర్వాత ఆ సినిమాకి ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే సాంగ్స్ రాయాలని నిర్ణయించుకున్నారట. ఈ మూవీ నిర్మాత చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారు. అదే విషయం చెప్పగా సీతారామశాస్త్రి "పర్లేదు, నేను ఫ్రీగానే రాసి పెడతాను" అంటూ ఆయన ఈ మూవీకి ఉచితంగా రాసి పెట్టారట. అలాంటి మంచి అనుబంధం తమ మధ్య ఉందని క్రిష్ తెలిపాడు. అలాగే ఈ సినిమా ఫెయిల్ అయితే తాను కచ్చితంగా సినిమాలు మానేసి విదేశాలకు వెళ్లి జాబ్ చేసుకునే వాడినని క్రిష్ చెప్పాడు.

అదృష్టం కొద్దీ "గమ్యం" సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఈ రోడ్డు ఫిలిం కి పాటలే చాలా బలమని కూడా ప్రేక్షకులు పేర్కొన్నారు. అయితే ఈ మూవీ విడుదలైన తర్వాత తనకి ఎంత నచ్చితే అంత డబ్బులు ఇస్తే చాలు అని సీతారామశాస్త్రి చెప్పారట. మరి చివరికి క్రిష్, నిర్మాత సీతారామశాస్త్రికి ఎంత డబ్బులు ఇచ్చారో తెలియ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: