నందమూరి బాలకృష్ణ తొలి చిత్రం 'తాతమ్మ కల' విడుదలై ఈ ఏడాదితో యాభయ్యేళ్లు పూర్తయ్యాయి. యాక్షన్‌, ఫ్యాక్షన్‌, పౌరాణికం, సైన్స్‌ ఫిక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌.. ఇలా కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ సినీ ప్రియులను అలరించారాయన. సినిమా మాధ్యమంగా వినోదమే కాకుండా సమాజానికి అవసరమైన సందేశాలను అందించారు. ఇటీవల ఆయన నటించిన 'భగవంత్‌ కేసరి' దానికి ఒక ఉదాహరణ. నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని టాలీవుడ్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం వేడుక చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, విజయ్ దేవరకొండ, అఖిల్‌, గోపీచంద్‌, సాయిధరమ్ తేజ్‌, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌తోపాటు తమిళ నటులు విజయ్‌ సేతుపతి, శివ కార్తికేయన్‌, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌లకు ఆహ్వానం అందింది.అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమం కోసం ఇప్ప‌టికే టాలీవుడ్ అగ్ర న‌టులుతో త‌దిత‌రులకు ఆహ్వానాన్ని అందించారు. అయితే అంద‌రికి ఇచ్చారు కానీ సొంత కుటుంబంలోని జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు నంద‌మూరి క‌ళ్యాణ్‌కు మాత్రం ఇన్విటేషన్‌ పంపలేదని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సొంత ఫ్యామిలీకి ఆహ్వానం పంప‌క‌పోవ‌డంతో నంద‌మూరి ఫ్యాన్స్ రెండుగా చీలుతార‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రోవైపు ఈ కామెంట్ల‌పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర క‌థానాయకుల‌తో పాటు అంద‌రికి ఇన్విటేషన్ వెళ్లిన‌ట్లు తెలిపారు. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబం అని భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అంటూ చెప్పుకోచ్చారు. 

మ‌రోవైపు ఈ వేడుక‌లో పాల్గోన‌డానికి తార‌క్ ఇంట్రెస్ట్‌గా లేడ‌ని సమాచారం. అందుకే త‌న అమ్మమ్మ ఊరు అయిన కుందపూర్‌కు వెళ్లిన‌ట్లు టాక్.ఈ సందర్భంగా ఆదివారం రోజు దేశవ్యాప్తంగా ఉన్న అతిరథులైన నటీ నటులను ఆహ్వానించి రంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులను ఆహ్వానించేందుకు కమిటీ రామకృష్ణను నియమించింది. అయితే ఎలా చూసినా నందమూరి ఫ్యామిలీలో ఫస్ట్ టైమ్ నటుడుగా 50యేళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య ఫంక్షన్ అంటే కుటుంబం మొత్తం వస్తుంది. కానీ ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదు. గతంలో పెద్దాయన శత జయంతి సభకూ రాలేదు ఎన్టీఆర్. అప్పుడే రానివాడు ఇప్పుడేం వస్తాడు అనుకున్నారో లేక.. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం పక్కన బెట్టింది. ఈ కారణంగానే ఆయన్ని పిలవలేదా అనేది ఎవరి ఊహలకు వాళ్లకే వదిలేయొచ్చు.విశేషం ఏంటంటే.. ఆదివారం రోజున బాలయ్య ఫంక్షన్ జరుగుతుండగా.. శనివారం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి తన తల్లి సొంత ఊరు కర్ణాటకలోని కుందాపుర వెళ్లాడు. ఉడిపి టెంపుల్ లో శ్రీ కృష్ణుడి ఆశిస్సులు కూడా అందుకున్నాడు. అంటే అతను కూడా బాలయ్య ఫంక్షన్ ను ‘స్కిప్’ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నాడు అనుకోవచ్చా. ఒకవేళ ఇవాళే నందమూరి రామకృష్ణ... తారక్ ను ఆహ్వానించాలనుకుంటే అప్పుడు ఇలాగే అర్థం అవుతుంది కదా.

 ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ అంతా కలిసే ఉంది.. ఒక్క జూనియర్ తప్ప.ఫ్యామిలీ మొత్తం బాలకృష్ణ ఇంటి నుంచి ఒకే బస్‌లో వేడుకకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇలాంటి ముఖ్యమైన ఈవెంట్‌ను జూనియర్‌ మిస్సవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో సీనియర్‌ ఎన్టీఆర్ శత జయంతుత్సవాలకు కూడా ఎన్టీఆర్‌ వెళ్లలేదు. ఇప్పుడు అలాంటి మరో ఇంపార్టెంట్‌ కార్యక్రమానికి దూరమైపోవడమే టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ప్రభావం దేవరపై తప్పకుండా ఉంటుందని అంటున్నారు సినీ పండితులు.జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్నా… ఇప్పటివరకు సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు నిర్మాతలు. దీనిపైనే అభిమానులు టెన్షన్‌ పడుతుండగా, తాజాగా నందమూరి ఫ్యామిలీ వార్‌తో జూనియర్‌ను అంతా దూరం పెట్టడం అభిమానులను మరింత షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా, సినీ పరిశ్రమ పెద్దలు చంద్రబాబుతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు.గతేడాది 'భగవంత్‌ కేసరి'తో అలరించారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. NBK 109గా ఇది ప్రచారంలో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: