భీష్మ, సుల్తాన్, పుష్ప, సీతారామం, యానిమల్ సినిమాలు చేశాక రష్మిక మందన్నకు చాలా ఫేమ్‌ వచ్చింది, ఇంకేముంది అదే ఫేమ్‌ని ఉపయోగించుకుంటూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలాగని అక్కడితో ఈ అమ్మడు సాటిస్ఫై కావడం లేదు. ఈ బ్యూటీ తనలో ఉన్న పొటెన్షియల్‌ని వాడుకొని ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో నంబర్ వన్ హీరోయిన్ కావాలని ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో తన వద్దకు వచ్చిన ప్రతి పాన్ ఇండియా సినిమాకి సైన్ చేస్తోంది.

రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా కంప్లీట్ చేయాలి. కాగా తన పార్టుకు సంబంధించిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా కంప్లీట్‌ చేసేసి తన ఇతర ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని ఈ అమ్మడు భావిస్తోంది. పుష్ప2 తో పాటు కుబేర షూట్‌ని కూడా ఒకేసారి కంప్లీట్ చేయాలని ఈ అందాల తార భావిస్తోంది. ఈ రెండు సినిమాలను ఎంత త్వరగా పూర్తిగా చేస్తే ఆమె అంత త్వరగా తన నెక్స్ట్ హిందీ మూవీ "వాంపైర్స్ ఆఫ్‌ విజయ్‌ నగర్‌" షూటింగ్ షెడ్యూల్‌లో జాయిన్ కాగలదు. లేదంటే ఈ అందాల తార సినిమాలు చాలా లేట్ అయిపోతాయి.

అక్టోబర్‌లో ఈ హారర్ మూవీ షూట్‌ స్టార్ట్ చేయనున్నారు. నెక్స్ట్ మంత్ మూడవ వారంలో రష్మిక, ఆయుష్మాన్‌ ఖురానా షూట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇది హంపీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ హారర్‌ కామెడీగా సినిమాగా వస్తుందని ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది. వాంపైర్స్ ఆఫ్‌ విజయ్‌నగర్‌ సినిమాపై ఆల్రెడీ చాలా హైప్స్ పెరిగిపోయాయి. స్త్రీ2, బేడియా, ముంజ్య వంటి హారర్ కామెడీ సినిమాల లాగానే ఇది కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అప్‌కమింగ్ సినిమాలో రష్మిక పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని టాక్. ఆ వేరియేషన్స్ అన్నీ చక్కగా చూపించగలిగితేనే రష్మికకు మంచి పేరు వస్తుంది లేదంటే చాలా ట్రోల్స్‌కి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ముద్దుగుమ్మకు చాలా చెడ్డ పేరు రావచ్చు. అలాగే సినిమా అవకాశాలపై ప్రభావం పడవచ్చు.

హారర్ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ చూపించి ప్రేక్షకులని భయపెట్టాలి. దానికి ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ టాలెంట్ ఉండాలి. రష్మికకు అలాంటి యాక్టింగ్ స్కిల్స్  ఉన్నాయో లేదో చూడాలి మరి. సాయి పల్లవి గార్గి, విరాటపర్వం లాంటి డిఫరెంట్ సినిమాలు చేసి దెబ్బతిన్నది రష్మిక కూడా ఆమె లాగానే తయారవుతుందా అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: