అన్ని సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిపోయింది హేమ కమిటీ.ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరుగా బయటికి వచ్చి చెబుతున్నారు. అలాగే కొంతమంది సీనియర్ నటులు కూడా తమతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవారని మాట్లాడుతూ ఉండేవారని మరి కొంతమంది దాడులు చేసే వారంటూ కూడా పలు రకాల ఆరోపణలు తెలియజేయడం జరిగింది. దీంతో ఇప్పటికే ఇద్దరి నటుల పైన కూడా కేసులు నమోదైనట్టుగా సమాచారం. అంతేకాకుండా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఆ పదవిలో నుంచి తప్పుకోవడంతో పేను దుమారం సృష్టిస్తోంది. మోహన్లాల్ కూడా ఇటీవలే  AMMA కు రాజీనామా చేశారు.


హేమ కమిటీ మీద ఇప్పటికే మోహన్లాల్ మమ్ముట్టి వంటి వారు స్పందించడం జరిగింది.. ఇప్పుడు తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కమిటీ వేయాలంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారట.. అయితే ఈ విషయం పైన విశాల్ తనకు ఏమాత్రం తెలియదని చెబుతూ సారి తెలియజేశారట.. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి కమిటీ అవసరమా లేదా అనే విషయం పైన రజనీకాంత్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఈ విషయం తనకు తెలియదంటూ చెప్పడంతో చాలామంది విమర్శిస్తున్నారు.


మలయాళ నటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు యాక్టర్ జయసూర్య పైన నాన్బెయిల్ కేసు నమోదు అయినట్టుగా తెలిసిందే.. అదే విధంగా డైరెక్టర్ రంజిత్ మరొక నటుడు సిద్ధిక్ వంటి వారి పైన కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఈ విషయం పైన సీనియర్ హీరోయిన్ రాధిక, ఖుష్బూ, అమలాపాల్, సమంత తదితర నటి నటులు సైతం స్పందించారు.. మోహన్లాల్ మమ్ముట్టి వంటి వారు  స్పందించినప్పటికీ.. రజినీకాంత్ వంటి నటులు కేరళలో ఏర్పాటుచేసిన హేమా కమిటీ నివేదిక పైన స్పందించమంటే తనకు ఏమీ తెలియదని చెప్పడంతో చాలామంది ఫైర్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: