‘పవన్ కల్యాణ్’ అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్..!!


* పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే యూత్ లో తెలియని వైబ్రేషన్

* అవతలి వాడు ఎవడైనా దూసుకెళ్లే నైజం పవన్ కల్యాణ్ కే సొంతం..

* నిజాయితీకి నిలువెత్తు రూపం..వ్యక్తిత్వమే పవన్ తిరుగులేని స్టార్ డం కి కారణం..


పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ లో వచ్చే హోరు, జోరు అంతా ఇంతా కాదు.. సినీ రంగంలో పవన్ కల్యాణ్ కు వున్న క్రేజే వేరు.. ఆ క్రేజ్ కు కారణం ఆయన వ్యక్తిత్వం.. కోట్లు సంపాదిస్తున్న ఎప్పటికి చూపించని గర్వం.. ముఖంలో ఎప్పటికీ చెరిగిపోని చిరునవ్వు..కోట్లు కన్నా విలువైన అభిమానుల ప్రేమ పవన్ కల్యాణ్ ను అందనంత ఎత్తులో నిలిపింది.. చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కల్యాణ్ తన సొంత టాలెంట్ తో తనదైన స్థాయిలో ఎదిగారు.. పవన్ కల్యాణ్ మ్యానరిజం,ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. ప్రేక్షకులలో ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా మారారు..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఆరోజు డై హార్డ్ ఫ్యాన్స్ కు సైతం టికెట్ దొరకని పరిస్థితి.పవన్ అంటే అంతలా క్రేజ్ ఏర్పడింది..పవన్ కల్యాణ్ చిన్నతనం నుంచి ఎన్నో కష్ట, నష్టాలను చవి చూశారు. సినిమాల పరంగా ఎన్నో అపజయాలు పలకరించిన ఆయనంటే ఫ్యాన్స్ లో వుండే నమ్మకమే ఆయనపై క్రేజ్ మరింత రెట్టింపు చేసింది.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ కు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి..అయినా సరే పవన్ ఎక్కడా కూడా నిరుత్సాహపడలేదు. అపజయాలను అనుభవ పాఠాలుగా మల్చుకుని ముందుకు సాగారు. పవన్ జనసేన పార్టీ పెట్టిన నాటి నుండి ఆ పార్టీని ప్రజలలో బలోపేతం చేసేందుకు ఎంతో కష్ట పడ్డాడు..తన క్రేజ్ చూసి పార్టీలో జాయిన్ అయిన నాయకుల వల్ల పవన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు.. తాను డౌన్ ఫాల్ అయ్యే సమయానికి ఆయన నమ్మిన నాయకులు ఆయన్ని వదిలేసి వెళ్లిపోయారు.. కష్టం వచ్చింది అని చెబితే ఆ కష్టాన్ని పోగొట్టేంతవరకు ఊరుకోని మనస్తత్వం పవన్ కల్యాణ్ ది..అందుకే పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి ఎంతో మందికి సహాయం అందించారు.. కోట్లు వచ్చే వృత్తిని సైతం పక్కన పెట్టి  ప్రజలకు అండగా నిలబడ్డారు.


2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయాక అప్పటి అధికారపార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శించారు..వాటినన్నిటిని ఎంతో ఓర్పుగా భరించి మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. తనని విమర్శించిన ప్రతి ఒక్కరికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తానంటూ సవాల్ విసిరారు..2024 సార్వత్రిక ఎన్నికల రానే వచ్చాయి.ఆ ఎన్నికల్లో కూటమి గా ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ సంచలన విజయం అందుకున్నాయి.ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వంద శాతం స్ట్రైక్ రేటు సాధించింది. గత కొన్నాళ్ళుగా పవన్‌ కల్యాణ్ ను ఎగతాళి చేసిన వ్యక్తులే శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్  భాద్యతలు స్వీకరించారు..ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ బర్త్ డే.. ఈ పుట్టినరోజు పవన్ కల్యాణ్ కు ఎంతో ప్రత్యేకం.. డిప్యూటీ సీఎం అయిన తరువాత వచ్చిన పవన్ కల్యాణ్ మొదటీ బర్త్ డే కావడంతో అభిమానులు భారీ సెలెబ్రేషన్స్ కు ఏర్పాట్లు చేసుకున్నారు..అలాగే పవన్ బర్త్ డే రోజే బ్లాక్ బస్టర్ మూవీ “ గబ్బర్ సింగ్ “ రీరిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేవు..

మరింత సమాచారం తెలుసుకోండి: