ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల విడాకుల వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎంతల హాట్ టాపిక్ గా మారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తమ ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని అభిమానులను సంతోషపరిచారు. కానీ ఇప్పుడు వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారు అంటూ ఎంతోమంది స్టార్ సెలబ్రెటీల గురించిన వార్తలు ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి వార్తలు రావడమే కాదు కొన్ని నిజం అవుతూ కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 గతంలో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చి సంచలనంగా మారగా.. ఈ వార్త నిజమైంది. ఇక ఆ తర్వాత ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రాగా.. ఇది నిజమే అన్నట్లుగా వారు విడాకుల ప్రకటన చేసేసారు. ఇక ఆ తర్వాత కాలంలో రణబీర్ సింగ్, దీపికా పదుకొనే కూడా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. ఈ వార్తలను ఈ స్టార్ కపుల్స్ కొట్టి పారేశారు. అయితే గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాను ఊపేస్తున్న ఇలాంటి వార్తల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల న్యూస్ కూడా ఒకటి. నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్నదానికి సంబంధించి ఎన్నో ఘటనలు బలాన్ని చేకూర్చాయి.


 కానీ ఐశ్వర్య, అభిషేక్ విడిపోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు అన్న దానికి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తాము డివోర్స్ తీసుకోబోతున్నాము అని రూమర్లకు అభిషేక్, ఐశ్వర్య మరోసారి చెక్ పెట్టారు. వీరు తమ కూతురు ఆరాధ్యతో కలిసి దుబాయ్ ఎయిర్పోర్టులో కనిపించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. విడాకులు తీసుకోవట్లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న విడాకుల వార్తలను అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో ఖండించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: