- సినిమాలో తనదైన శైలితో పవర్ స్టార్ అయ్యారు..
- అన్నల ప్రేమతో అందలమెక్కిన పవన్..
- సూసైడ్ స్టేజి నుంచి  డిప్యూటీ సీఎం వరకు పవన్ ప్రస్థానం..

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. ఏదైనా మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లే తత్వం. సన్నగా కరెంట్ తీగలా ఉన్నా తనదైనా స్టైల్, నటనతో  తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులను తన సొంతం చేసుకున్నారు.  అందరు హీరోల అభిమానులు ఒకెత్తయితే పవన్ అభిమానులు మరో ఎత్తు..ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరికీ అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు. ఆ విధంగా యూత్లో ఎంతో ఫాలోయింగ్ పెంచుకున్న పవన్ కళ్యాణ్ తన సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తాను అనుకున్న స్థాయికి ఎదగాలనుకున్నారు. ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఛీత్కారాలు ఎదురైనా, ఎంతమంది తొక్కేయాలని చూసినా తను ఎదగడానికి మెట్లుగా మార్చుకొని ఒక్కో అడుగు ముందుకేసాడు. జనసేన పార్టీని జాతీయస్థాయిలో  గుర్తించేలా చేశారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నారట.  చివరికి అలాంటి స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా మారి అనేక సేవలు అందిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మరణించాలనుకున్నారు.. ఆయనను కాపాడింది ఎవరు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 సూసైడ్ నుంచి యూత్ ఐకాన్ గా..

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  జనసేన పార్టీని స్థాపించి గత పది సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా తాను అనుకున్న పంతాన్ని వదిలిపెట్టకుండా, ఒక ప్లానింగ్ ప్రకారం దూసుకెళ్లాడు. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు రాష్ట్రాన్నెలా కాపాడుతాడని  ఎంతోమంది నిందించారు.  అయినా తగ్గని పవన్ కళ్యాణ్ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా 2024 ఎలక్షన్స్ వరకు టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావించాడు. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసి పూర్తిస్థాయి మెజారిటీ సాధించాడు.. చివరికి కూటమి ప్రభుత్వంలో  సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో  వారిలో ఆత్మవిశ్వాసం నింపే ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులు ఎవరు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని,  ఆత్మహత్యలు అనేవి సమస్యకు పరిష్కారం కాదని అన్నారు.


 నేను చిన్నతనంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, మా ఇంట్లో వాళ్లు నన్ను ఆపారని గుర్తు చేశారు. కష్టాలు చుట్టుముట్టినప్పుడు  ఆత్మహత్య గుర్తుకొస్తుంది. కానీ అది మంచి పద్ధతి కాదని వివరించారు. నేను ఇంటర్మీడియట్ లో రెండుసార్లు  ఫెయిల్ అయ్యాను. దీంతో బతకడం వేస్ట్ అనుకోని ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఆపారు. ఆ టైంలో నాకు చనిపోతే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే చావు అనేది సుఖంగా ఉంటుంది. అందుకే సరైన దారిగా ఎంచుకొని ఆత్మహత్య చేసుకోబోతే మా ఇంట్లో వాళ్ళు ఆపి ధైర్యం నింపారు.  అప్పుడు మొదలైన నా ప్రయాణం ఇక ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే విధంగా రాటుదేలాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది ఛీత్కరించినా  నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ముందుకు వెళ్లాను తప్ప వెనక్కి చూసుకోలేదు అన్నారు. అలాంటి స్థాయి నుంచి పవన్ కళ్యాణ్  ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: