- పవన్ అంటే ఎంతో ప్రేమ..
- ప్రతి పనిలోనూ తమ్ముడికి అండగా..

- తెలుగు రాష్ట్రాల్లో మెగా బ్రదర్స్ అంటే గౌరవం..
- ఒకరికొకరు తోడు నీడగా..

 తెలుగు రాష్ట్రాల్లో మెగా బ్రదర్స్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.. ఇందులో ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అని చెప్పలేం. ఒకరికొకరు గౌరవించుకుంటూ ఎవరి హద్దుల్లో వారు ఉంటారు. మెగా బ్రదర్స్ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లు అయినటువంటి నాగబాబు,పవన్ కళ్యాణ్ కు అన్నగా కాకుండా ఒక తండ్రిలాగా కేరింగ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చెప్పిన విధంగానే ఇద్దరు తమ్ముళ్లు మెదులుకుంటూ వారు కూడా ఓ స్థాయికి ఎదిగారు. ఇందులో పవన్ కళ్యాణ్ కాస్త దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అంటే తప్పనిసరిగా మొండిపట్టుతో ముందుకు వెళ్తాడు. వెళ్లడం కాదు దాన్ని సాధించే తీరుతాడు. అలా మెగా బ్రదర్స్ లో నాగబాబు చిరంజీవి ఇద్దరు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అమితంగా ప్రేమిస్తారు.చిన్న తమ్ముడు కాబట్టి ముద్దుగా  తమ్మున్ని చూసుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ కూడా తన ఇద్దరు అన్నలపై ఈగ వాలినా ఊరుకోడు. ఆ విధంగా మెగా బ్రదర్స్ అనుబంధం తెలుగు ఇండస్ట్రీలోనే ఒక గొప్ప బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. అలాంటి మెగా బ్రదర్స్ అనుబంధం గురించి మరికొన్ని విషయాలు చూద్దాం.

 ఒకరికొకరు తోడు నీడ..

 పవన్ కళ్యాణ్ మొదట్లో కాస్త దూకుడు సభావంతో ఉండేవారు. తన అన్న ఏది చెప్పినా వినేవాడు కాదు. చివరికి ఒకానొక సమయంలో  ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారట. ఆ సందర్భంలో చిరంజీవి ఆయనకు ధైర్యం చెప్పి ఒక దారిలో వెళ్లేలా  చేశారు. అలా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చివరికి యూత్ ఐకాన్ గా మారి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అలా సినిమాల్లో రాణించిన ఆయన కొన్నాళ్ల తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. చిరంజీవి కాస్త వద్దని చెప్పినా కానీ చివరికి సపోర్ట్ చేశారట. ఇక జనసేన పార్టీ స్థాపించిన తర్వాత నాగబాబు తన తమ్ముడి వెంటే ఉంటూ తన బాగోగులు చూసుకుంటూ ఎవరైనా విమర్శిస్తే వారికి ప్రతివిమర్శలు చేస్తూ తమ్ముడికి ఆసరాగా నిలిచాడు. అలా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా చేసి చివరికి పార్టీని జాతీయస్థాయిలో గుర్తించేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పవచ్చు. ఈ విధంగా అన్నదమ్ములు ముగ్గురు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులుగా మారారు.  


చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వీరి ముగ్గురిని ఎంతో అభిమానించారు. ఈ విధంగా అన్నదమ్ముల ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు అనే విధానానికి వీరే అసలైన నిదర్శనం అని చెప్పవచ్చు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఎంత ఎదిగినా అన్నలిద్దరిని గౌరవిస్తూ తాను అనుకున్నా పనిని సాధిస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. చిరంజీవిని ఎవరైనా ఏదైనా అంటే ఆయన సైలెంట్ గానే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అస్సలు ఊరుకోరు.అంతేకాదు అన్నని రౌడీలు అవమానించారని తెలిసి నెక్స్ట్ డే వెళ్లి వారిని కొట్టి వచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ కి ఉంది.అలాగే తన రెండో అన్నయ్య నాగబాబు అప్పుల్లో చిక్కుకున్నారని అన్నయ్య అప్పులు తీర్చడం కోసం తనకు ఇష్టం లేకపోయినా సినిమా చేసి అది చేయగా వచ్చిన డబ్బులతో అన్నయ్య అప్పులను తీర్చేశారు.అలా ఇద్దరు అన్నదమ్ములతో పవన్ కళ్యాణ్ కి విడదీయలేని బంధం ఉంది.  అలాంటి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: