•అన్న కోసం ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్..

•ఈ విషయంపై నివేదించి విడాకులు తీసుకున్న రేణు దేశాయ్

•పవన్ కళ్యాణ్ మంచి మనసుకు ఇంతకంటే నిదర్శనం ఉంటుందా..

(ఇండియా హెరాల్డ్ - ఆంధ్ర ప్రదేశ్)



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి,  స్టార్ స్టేటస్ గురించి,  సహాయం చేసే గుణం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన సేవాగుణంలో అంతకుమించి పేరు దక్కించుకున్నారు. నాడు ఆయన చేసిన కష్టమే నేడు ఆయనను ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు అందించింది. ఇకపోతే ఇతరులకు కష్టం వస్తే సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్ , ఆ సహాయాల కారణంగానే వైవాహిక జీవితంలో భార్యకు దూరమయ్యారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సేవా గుణం ఎక్కువ. ఆ గుణం నచ్చే ఆయనకు అప్పటికే వివాహం జరిగి విడాకులు అయ్యాయని తెలిసి కూడా ప్రముఖ మోడల్,  హీరోయిన్ రేణు దేశాయ్ ఆయనతో సహజీవనం చేసింది.  ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆయనపై నమ్మకంతోనే ఇలా చేసిన ఈమె ఆ తర్వాత బిడ్డ సమక్షంలో వివాహం చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఏ తల్లి కైనా సరే ఆలోచనలు మారిపోతాయి. తన భర్త సంపాదించిన డబ్బు తన బిడ్డలకే చెందాలి అని,  తన బిడ్డలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆలోచిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఆలోచించింది రేణు దేశాయ్ కూడా.. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన ఆలోచనను, తన గుణాన్ని,  క్యారెక్టర్ ను మార్చుకోలేకపోయారు. అలా ఒకసారి రాంచరణ్ హీరోగా, నాగబాబు నిర్మాతగా కోట్ల రూపాయలను బడ్జెట్ గా  పెట్టి ఆరెంజ్ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ సినిమా మ్యూజికల్ పరంగా హిట్ అయింది. కానీ గోర డిజాస్టర్ ను  చవి చూసింది. ఎంత డిజాస్టర్ అయ్యిందంటే ఆస్తులు అమ్ముకున్నారు నాగబాబు. అంతేకాదు ఈ సినిమాతో రోడ్డున పడ్డారు. తన అన్నయ్యను ఆర్థికంగా ఆదుకోవాలి అనుకున్న పవన్ కళ్యాణ్ , ఆర్థిక సహాయం చేసి అప్పులు  తీర్చారు. దీంతో జీర్నించుకోలేకపోయిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విభేదించి ఏకంగా విడిపోయింది కూడా.

అలా అన్నకు సహాయం చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ ఏకంగా వైవాహిక బంధంలో ఒక బంధాన్ని దూరం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ సహాయ గుణానికి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: