నందమూరి బాలకృష్ణ నటప్రస్తానానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. బాలయ్య తొలి సినిమా తాతమ్మకల 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈ 50 సంవత్సరాల కేరీలో బాలయ్య ఎన్నో అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. బాలయ్య తాతమ్మకల సినిమాతో తెరంగ్రేటం చేశారు. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం.. హీరోగా తొలి సినిమా సాహసమే జీవితం 1984లో ఈ సినిమా రిలీజ్ అయింది. బాలయ్య 25వ సినిమా నిప్పులాంటిమనిషి.. 50వ సినిమా 1990లో వచ్చిన నారి నారి నడుమ మురారి.


బాలయ్య 75వ సినిమా 1999 లో వచ్చిన కృష్ణ బాబు. బాలయ్య 100వ సినిమా 2017 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి - బాలయ్య ప్రస్తుతం కేఎస్ రవీంద్ర ( బాబి ) దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. పౌరాణికం - జానపదం - సాంఘికం - సైన్స్ ఫిక్షన్ - బయోపిక్ ఇలా అన్ని జాన‌ర్లను టచ్ చేసిన ఏకైక అగ్ర నటుడు బాలకృష్ణ. 1987లో బాలయ్య సినిమాలు ఎనిమిది రిలీజ్ అవ్వగా అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య నరసింహనాయుడు, సింహా, లెజెండ్ సినిమాలకు మూడు నంది అవార్డులు అందుకున్నారు. అలాగే లెజెండ్ సినిమాకు సైమా అవార్డు కూడా దక్కింది. మొత్తం ఆరు ఫిలిం పేరు అవార్డులు దక్కాయి.


బాలయ్య - కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 సినిమాలలో నటించారు.. 17 సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు. అధినాయకుడు సినిమాలో ట్రిఫుల్ రోల్‌ పోషించారు. బాలయ్య డ్రీమ్ రోల్స్ చెంఘీస్ ఖాన్, గోన గన్నారెడ్డి, రామానుజాచార్య. బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏకంగా 60 గెటప్పులలో కనిపించారు. బాలయ్య సుదీర్ఘ ప్రస్థానంలో ఎంత ఉత్సాహంగా చేసిన సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్.


బాలయ్య - బోయపాటి కాంబినేషన్ వచ్చిన సినిమాలు అన్నీ ఫైట్ సీన్ తోనే ప్రారంభం అయ్యాయి. అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య నటించిన 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. లెజెండ్ సినిమా 1100 రోజులకు పైగా ఆడింది. తండ్రి బ‌యోపిక్‌లో తండ్రి పాత్రను తనయుడు పోషించడం భారతీయ సినీ చరిత్రలోనే బాలయ్యతో సాధ్యమైంది. గౌతమీపుత్ర శాతకర్ణిలోని కొన్ని సీన్ల‌కు.. పెద్దన్నయ్య క్లైమాక్స్ కు బాలయ్య దర్శకత్వం వహించారు. ఓ సూపర్ స్టార్ తో రైతు పేరుతో సినిమా తెరకెక్కించాలనేది బాలయ్య డ్రీమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: