- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

నందమూరి నట‌సింహ బాలకృష్ణ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు దాటుతోంది. 1974లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకల సినిమాతో బాలయ్య వెండితెరపై తొలిసారిగా కనిపించారు. నాటి నుంచి నేటి వరకు బాలయ్య వెనక్కు తిరిగి చూసుకోలేదు.. 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2019లో ప్రతికూల పరిస్థితులలోను వరుసగా రెండోసారి గెలిచిన బాలయ్య .. 2024 ఎన్నికలలో వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. ఇది సెన్షేష న‌ల్ రికార్డు అని చెప్పాలి.


ఇదిలా ఉంటే బాలయ్యకు పెళ్లయిన కొత్తలో అత్తగారి ఊళ్లో విచిత్ర అనుభవం ఎదురయిందట. ఆ విషయాన్ని తాజాగా పంచుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఆ పనులతో బిజీగా ఉండడంతో బాలయ్య పెళ్లికి కూడా ఎన్టీఆర్ వెళ్లలేదు.. బాలయ్య భార్య వసుంధర అమ్మగారిల్లు కాకినాడ.. కొత్త అల్లుడిగా బాలయ్య అత్తారింటికి కాకినాడ వెళ్లారట.. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి బాలయ్య దగ్గరికి వచ్చి మీటింగ్ ఉంది మీరే మాట్లాడాలి అన్నారట.. అప్పటివరకు బాలయ్యకు సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలియదు.


30 వేల మంది హాజరయ్యే సమావేశంలో మాట్లాడాలంటే దడ పుట్టిందట‌. తప్పించుకోవటానికి నాన్నగారిని అడగాలని చెప్పారట బాలయ్య. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి మీరు ప్రసంగిస్తారని ప్రకటించేసాం అని బాంబు పేల్చడంతో బాలయ్యకు ఏం చేయాలో ? తోచలేదట. బాలయ్యకు ఉన్న అవగాహన మేరకు నాలుగు ముక్కలు పేపర్లో రాసుకుని వెళ్లి మాట్లాడారట.. వెంటనే జనాలు చప్పట్లు.. ఈల‌లు మారుమోగిపోయాయట. బాలయ్య బాగా మాట్లాడుతున్నాడు అని మెచ్చుకోవడంతో రాష్ట్రమంతా ప్రచారాన్ని తీసుకువెళ్లారు.. నాన్నగారు సీఎం అయిన ఆయన పదవి తాలూకు అధికారాన్ని తాము ఇప్పుడు వాడుకోలేదని బాలయ్య తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: