నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా 109 వ అని తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్యసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.

 సదరు యాంకర్ 'మీ 109 వ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? అని అడగగా..బాలయ్య సమాధానం ఇస్తూ..'వర్క్ జరుగుతుంది. రీసెంట్ గానే జైపూర్ లాంచ్ షెడ్యూల్ షూట్ చేశాం. ఇక రిలీజ్ విషయానికి వస్తే డిసెంబర్లో లేదా సంక్రాంతికి వచ్చేస్తున్నాం' అని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య ఇంకా మాట్లాడుతూ..'ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక, మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎన్నికల ప్రచారం వల్ల మూడు మూడున్నర నెలలు పాటు షూటింగ్ ఆపాల్సి వచ్చింది.

ఏది ఏమైనా డిసెంబర్ కల్లా రిలీజ్ కి రెడీగా ఉంటాం' అని బాలయ్య చెప్పుకొచ్చారు. అన్నట్టు ఈ సినిమా ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ పథకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ సినిమాలను మాత్రం ఎవ్వరు మిస్ అవ్వరు.

మరింత సమాచారం తెలుసుకోండి: