బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మోక్షజ్ఞ రీసెంట్గా సినిమాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞ హీరోగా యంగ్ టైగర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఈ సినిమా ప్రారంభం పై నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.

బాలయ్య సినీ రంగా ప్రవేశం చేసి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి మాట్లాడుతూ..'మోక్షజ్ఞ పై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండానే వాడు స్టార్ అయిపోయి కూర్చున్నాడు. మేము ఎంతో కష్టపడి స్టార్స్ అయ్యాము.

కానీ, మోక్షజ్ఞ ఒక పిక్చర్ చెయ్యకుండానే స్టార్ అయిపోయాడు. మరో మూడు నెలల్లో తన మొదటి సినిమా మొదలవుతుంది' అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. బాలయ్య, మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంకా మాట్లాడుతూ..'తనను ఎలా ఇంట్రడ్యూస్ చెయ్యాలో నాకు తెలుసు. అది నాకు చాలా ఈజీ. చాలామంది తమ పిల్లల భవిష్యత్తు గురించి చాలా ప్రణాళికలు వేస్తుంటారు. ఎంతో ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ఎంతో డెన్షన్ అనుభవిస్తుంటారు. నాకు అదేమీ లేదు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్స్ నా మైండ్ లోని రెడీగా ఉన్నాయి' అని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య సినీ రంగా ప్రవేశం చేసి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక మోక్షజ్ఞ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఇది ఇక ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: