తాజాగా బుల్లితెర ప్రేక్షకులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన సంగతి అందరికీ వివిధమే. ఈ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారు. అందులో యాంకర్ విష్ణుప్రియ కూడా ఉన్న సంగతి అందరికీ విధితమే. ఇక విష్ణుప్రియ షార్ట్ ఫిలిమ్స్ లలో తన కెరీర్ ని మొదలుపెట్టి యాంకర్ గా కాకుండా పలు టీవీ షో లలో చురుగ్గా పాల్గొంటుంది. అంతేకాకుండా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో విష్ణు ప్రియకు సంబంధించిన ఒక పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కరలు కొట్టింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ కు నేను అసలు వెళ్ళనని చెప్పిన విష్ణు ప్రియ ప్రస్తుతం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది.


గతంలో విష్ణుప్రియ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే.. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళను. నేను బిగ్బాస్ పర్సన్ కాదు. నేను ఆ షోను ఇప్పటివరకు చూడలేదు. అంతేకాకుండా.. నేను పర్సనల్ గా బిగ్ బాస్ ను ఎంకరేజ్ కూడా చేయను. నేను ఎప్పటికీ ఆ షో కి వెళ్ళను. ఒకవేళ వెళ్తే నన్ను నిందించండి అంటూ ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

ఇక గతంలో అయితే అప్పుడు ఏమో అలా మాట్లాడి.. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లడంతో  కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు విష్ణు ప్రియని ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు మనుషుల అభిప్రాయాలు మారిపోతాయి.. డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చని వెళ్లి ఉండొచ్చు అని పలువురు వారి భావన తెలియజేస్తున్నారు. అంతేకాకుండా.. అవసరాలు మనుషులను మారుస్తాయి అంటే ఇదేనేమో మరి దీనిపై హౌస్ నుంచి బయటకు వచ్చాక విష్ణు ప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: