సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. మరి కొన్ని రోజుల్లోనే మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి , మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగ వంతంగా పూర్తి చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే గుంటూరు కారం సినిమా విడుదల అయిన తర్వాత నుండి మహేష్ బాబు , రాజమౌళి సినిమా కోసం కసరత్తులను మొదలు పెట్టాడు. అందులో భాగంగా భారీ జుట్టును , గడ్డాన్ని పెంచుతున్నాడు.

అలాగే బయటకు వచ్చినప్పుడు కూడా మహేష్ కొత్త లుక్ ను టోటల్ గా రివీల్ చేయకుండా క్యాప్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇలా రాజమౌళి సినిమా కోసం మహేష్ సరి కొత్త లుక్ లోకి మారాడు. ఇక మహేష్ రూట్ ను చరణ్ కూడా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో చరణ్ పెద్ద కొత్త లుక్ అండ్ ట్రై చేయలేదు. ఇక చరణ్ తన తదుపరి మూవీ ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.

సినిమా కోసం మాత్రం చరణ్ అత్యంత కొత్త రకం గెటప్ లోకి మారబోతున్నట్లు తెలుస్తోంది. దాని కోసం బుచ్చిబాబు ఓ వైపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తూ ఉంటే చరణ్ మాత్రం ఆ సినిమా కోసం కొత్త లుక్ లోకి మారడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ మాదిరి గానే చరణ్ కూడా సరికొత్త లుక్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు , చరణ్ ను తన మూవీ లో ఎలాంటి లుక్ లో చూపిస్తాడో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: