తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరో ఐదు , పది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని పనులు పూర్తి కానున్నట్లు , ఆ తర్వాత ఈ సినిమా యొక్క ప్రమోషన్లను దేశ వ్యాప్తంగా ఈ మూవీ యూనిట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇండియా వరకు ఒకే కానీ ఈ సినిమాకు ఓవర్ సిస్ లో ఓ మూవీ ద్వారా పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం జోకర్ అనే మూవీ విడుదల అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ మూవీ కి కొనసాగింపుగా "జోకర్ 2" మూవీ ని రూపొందించారు.

ఈ సినిమాని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ ఓవర్ సిస్ లో ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ "జోకర్ 2" సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే దేవర సినిమాకు ఓవర్ సిస్ లో ఈ మూవీ కి కలెక్షన్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇలా "జోకర్ 2" మూవీ ద్వారా ఓవర్సీస్ ఏరియాలో దేవర మూవీ కి పెద్ద ప్రాబ్లం ఎదురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: