పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం హిందీ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దబాంగ్ మూవీ ని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమిక్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. బండ్ల గణేష్మూవీ ని నిర్మించాడు. ఇకపోతే గబ్బర్ సింగ్ పేరుతో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమాను ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీస్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా నాగబాబు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను చెప్పుకొచ్చాడు.

నాగబాబు తాజాగా మాట్లాడుతూ ... గబ్బర్ సింగ్ సినిమా చేయడానికి కంటే చాలా రోజుల ముందు ఒకరు దబంగ్ అనే సినిమా హిందీ లో వచ్చింది. అద్భుతమైన విజయం సాధించింది. మీరు చేయండి అనే ప్రతిపాదన పవన్ దగ్గరకు వచ్చింది. కానీ పవన్ కు ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్టైనర్ మూవీలు చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. దానితో చూద్దాంలే అని పక్కన పెట్టేశాడు. ఇక అదే సమయంలో నేను ఆరెంజ్ సినిమా చేసి చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. దానితో నా అప్పులు తీర్చడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. అప్పులు తీర్చేందుకు ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు. మైనస్ లో ఉన్నాడు. దానితో నా కోసం ఒక సినిమా చేసి నా అప్పులు తీర్చాలి అనుకున్నాడు.

దానితో వెంటనే ఎవరో చెప్పిన మాట గుర్తుకు వచ్చి దబాంగ్ సినిమా రీమిక్ చేయాలి అనుకున్నాడు. దానితో బండ్ల గణేష్సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక మొదట మా అన్నయ్య అప్పులు తీర్చి ఎంతో కొంత నాకు ఇవ్వండి సరిపోతుంది రెమ్యూనరేషన్ గా అన్నాడు. ఇక సినిమా సూపర్ గా వచ్చింది. ఆ తర్వాత పవన్ నాకు కొంత రెమ్యూనరేషన్ ఇవ్వు చాలు ఎక్కువ డబ్బులు ఏమొద్దు అని చెప్పాడు. అలా మొదట దబంగ్ రీమేక్ వద్దనుకున్న పవన్ నా అప్పులు తీర్చడం కోసమే ఆ సినిమా చేసినట్లు నాగబాబు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: