ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ చూడ్డానికి ఎంతో అందంగా, క్యూట్ గా, బబ్లీగా ఉంటుంది. తన అందమైన మాటలతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.


హన్సిక మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సింది ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. హన్సిక మోత్వాని తండ్రి ప్రదీప్ మోత్వాని ఓ ప్రముఖ వ్యాపారవేత్త. తల్లి మోనా మోత్వాన్ని డాక్టర్. హన్సిక పుట్టి పెరిగిందంతా ముంబై లోనే. తన విద్యాభ్యాసం కూడా ముంబైలోనే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో మొదటగా సీరియల్స్ లో నటించింది. నెమ్మదిగా సినిమాల్లో అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేసి ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది.


ఈ సినిమాలో తన నటనకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. ఇదిలా ఉండగా.... హన్సిక కొద్ది రోజుల క్రితమే సోహెల్ కతూరియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ 4, 2022న జైపూర్ లోని ముండోట కోట ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఇక తన భర్త సోహైల్ కు సంబంధించిన ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. సోహెల్ తన క్లోజ్ ఫ్రెండ్ రింకి మాజీ భర్త.


తన క్లోజ్ ఫ్రెండ్ భర్తనే హన్సిక రెండవ వివాహం చేసుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే సోహెల్ ను కలిసినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హన్సిక పేర్కొంది. వీరి పెళ్లికి హన్సిక స్నేహితురాలు రింకీ కూడా హాజరుకావడం విశేషం. సోహెల్ ప్రముఖ వ్యాపారవేత్త. 2016లో రింకీతో సోహైల్ కతూరియా మొదటి వివాహం జరిగింది. గోవాలో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఏమైందో తెలియదు విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక తన క్లోజ్ ఫ్రెండ్ భర్త అయినటువంటి సోహెల్ ను రెండవ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: