నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అని పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఆగస్టు 29 వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ సినిమాకు రీ రిలీస్ ల బెడద పట్టుకుంది.

ఎందుకు అంటే ఈ సినిమా ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుండగా ఆగస్టు 29 వ తేదీనే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఆయన పుట్టిన రోజు కు ఒక రోజు ముందు అనగా ఆగస్టు 28 వ తేదీన ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఒకటి అయినటువంటి మాస్ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ద్వారా సరిపోదా శనివారం ఓపెనింగ్స్ కి గట్టి దెబ్బపడే అవకాశం ఉంది అని చాలా మంది భావించారు. కానీ మాస్ మూవీ రీ రిలీజ్ ద్వారా సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లపై పెద్దగా వెయిట్ పడలేదు. ఇక ఈ రోజు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీస్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ రీ రిలీజ్ ఎఫెక్ట్ మాత్రం సరిపోదా శనివారం సినిమా కలెక్షన్ల పై కాస్త పడే ప్రభావం ఉంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లకే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ రోజు సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లపై గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీనిని కనుక సరిపోదా శనివారం దాటగలిగితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయినట్లే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: