నిన్న రాత్రి హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణ 50వ స్వర్ణోత్సవ వేడుకలను చాలా గ్రాండ్ గా జరిగాయి. బాలయ్య సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించారు. బాలయ్య హీరోగా రాణించినప్పుడే మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. వీరి మధ్య పోటీ ఉన్న సరే బయట మాత్రం మంచి ఫ్రెండ్స్ లాగా మెలుగుతుంటారు తాజాగా ఆయన బాలయ్య బాబు ఈవెంట్ కు వచ్చి సందడి చేశారు అంతేకాదు అభిమానులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆయన తన ప్రసంగంలో, చిరంజీవి సినీ పరిశ్రమలో జరిగే ఫ్యాన్ వార్ గురించి ఓపెన్ అప్‌ అయ్యారు.

బాలకృష్ణ అయినా వెంకటేష్ అయినా నాగార్జున అయినా సరే తామంతా ఒకే కుటుంబమని, తమ మధ్య ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఫాన్స్ బాలకృష్ణ అని విమర్శించినా అది తనని విమర్శించినట్లే అవుతుందని అన్నారు. బాలకృష్ణ చేసిన సమరసింహారెడ్డి సినిమా చూసాకే ఇంద్ర సినిమా చేయడానికి తాను సిద్ధమయ్యానని నందమూరి బాలకృష్ణపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

అలాగే బాలకృష్ణతో కలిసి ఓ ఫ్యాక్షన్ సినిమాలో నటించేందుకు ఆసక్తిని వ్యక్తం చేశాడు. నటీనటులు వృత్తిపరంగా పోటీపడుతుండగా, వారికి వ్యక్తిగత స్నేహాలు, గౌరవం ఉంటాయని చిరంజీవి నొక్కి చెప్పారు. తమ కుటుంబ కార్యక్రమాలకు బాలకృష్ణ ఎప్పుడూ హాజరవుతారని కూడా ఆయన పేర్కొన్నారు. తాము ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నామో చూసి, సోషల్ మీడియా ఫ్యాన్ వార్లలో కనిపించే శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని చిరంజీవి అభిమానులను ప్రోత్సహించారు.  

ఎప్పటి నుంచో ఉన్న ఈ ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియా వల్ల మరింత విషపూరితంగా మారాయని, ట్రోలింగ్, వ్యక్తిగత దాడులు, నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఎత్తిచూపారు. ఈ ప్రవర్తన ఆన్‌లైన్ కమ్యూనిటీకి హాని కలిగించడమే కాకుండా స్టార్‌ల ఇమేజ్‌ను కూడా దెబ్బతీస్తుంది. బాలకృష్ణపై చిరంజీవి ప్రశంసలు కురిపించడం, ఫ్యాన్స్ వార్స్ మానుకోవాలని అభిమానులకు ఆయన సున్నితంగా కోరడం చాలామందికి నచ్చింది. అయితే ఈ మెసేజ్ ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: