ఆయన ఇవాళ కర్ణాటకలోని ఉడుపి సిరి కృష్ణ దేవాలయాన్ని సందర్శించారు. పుట్టిన ఊరు సందర్శించడం... ఉడుపి లోని శ్రీకృష్ణ మఠం దర్శించుకోవాలని తన తల్లికి ఎప్పటినుంచో కోరిక ఉందని..అయితే, ఇవాళ ఆమె కోరిక తీరినందుకు సంతోషంగా ఉందని తారక్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 2 న తన తల్లి పుట్టినరోజు ఉండటం..రెండు రోజుల ముందు ఆమెకు ఈ విధంగా బహుమతి ఇవ్వడం సంతోషంగా ఉందని తారక్ చెప్పుకొచ్చాడు.
ఇక ఎన్టీఆర్ కి తోడుగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు కూడా ఈ పర్యటనలో ఉన్నాడు. అయితే, కర్ణాటకలో ల్యాండ్ అయినా తారక్ కి కన్నడ స్టార్ రిషబ్ శెట్టి వెల్కమ్ చెప్పడంతో పాటు ఆయనకు పర్యటనలో సాయం అందించాడు. కాగా, ఎన్టీఆర్ ఈ పర్యటనకు తన తల్లి, భార్య ప్రణీతను కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ పర్యటనకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టెంటా వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ దేవర మూవీ త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ దేవర మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.