తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తులలో నాగబాబు ఒకరు. నాగబాబు , మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్న అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరంజ్ అనే ఓ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కోసం ఈయన పెద్ద మొత్తంలో డబ్బులను ఖర్చు చేశాడు. కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తో తాను భారీ అప్పులలో కోరుకుపోయినట్లు , ఆ అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకొని చనిపోవాలి అనుకున్నట్లు , కానీ తన అన్నయ్య చిరంజీవి , తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తనను అప్పుల భారీ నుండి బయటకు తీసినట్లు నాగబాబు ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు.

ఇకపోతే నాగబాబు తాజాగా మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ నా అప్పులు తీర్చేందుకు ఒక సినిమా చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఏది అసలు జరిగిన పరిస్థితులు ఏవి అనే వివరాలను తాజాగా నాగబాబు వివరించాడు. నాగబాబు తాజాగా మాట్లాడుతూ ... ఆరెంజ్ సినిమా తర్వాత నేను భారీగా అప్పుల్లో కోరుకుపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ నా అప్పులు తీర్చాలి అనుకున్నాడు. కానీ పవన్ కూడా అప్పుడు అప్పుల్లో ఉన్నాడు. దానితో ఒక సినిమా చేసి నా అప్పులు తీర్చాలి అనుకున్నాడు. ఇక దబాంగ్ మూవీ ని గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి నా అప్పులు తీర్చాలి అని పవన్ డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా బండ్ల గణేష్ నిర్మాణంలో గబ్బర్ సింగ్ అనే మూవీ చేశాడు. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో పవన్ కళ్యాణ్ నా అప్పులను తీర్చాడు అని నాగబాబు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: