మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిరపకాయ్ అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిరపకాయ్ సినిమా టైటిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ... మొదట మిరపకాయ్ సినిమాకు ఆ టైటిల్ ను అనుకోలేదు. నేను ఆ మూవీ కి రొమాంటిక్ రిషి అనే టైటిల్ పెడదాము అనుకున్నాను.

ఆల్మోస్ట్ అదే టైటిల్ ను ఫిక్స్ చేయాలి అనుకున్నాము. అలాంటి టైమ్ లో రవితేజ కు ఆ సినిమాకు రొమాంటిక్ రిషి అనే టైటిల్ ను పెడదామనుకుంటున్నట్లు చెప్పెను. దానితో రవితేజ ఆ సినిమాకు రొమాంటిక్ రిషి కంటే కూడా మిరపకాయ్ అనే టైటిల్ బాగుంటుందేమో ఆలోచించండి అని అన్నాడు. దానితో నాకు రొమాంటిక్ రిషి అనే టైటిల్ కంటే కూడా మిరపకాయ్ అనే టైటిల్ చాలా బాగుంది అనిపించింది. వెంటనే రొమాంటిక్ రిషి టైటిల్ ను పక్కన పెట్టేసి మిరపకాయ్ అనే టైటిల్ ను ఆ సినిమాకు ఓకే చేసాం అని తాజాగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే తాజాగా రవితేజ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కూడా పెద్ద స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయలేదు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: