బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే రియాల్టీ షో ఆయన బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే., ఎప్పటిలాగే   బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది హౌస్ మేట్స్ హౌస్ లోనికి అడుగుపెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సీజన్లో ఎప్పటిలాగా సోలోగా కాకుండా జంటలగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కంటెస్టెంట్స్. అయితే హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లో 6 మంది పరాయి భాషకు చెందిన వాళ్లే ఉన్నారు. 

వీరు అందరూ కూడా తెలుగులో సీరియల్స్ షోలు సినిమాలలో చేశారు. ఇంతకీ వీళ్ళు ఎవరు నిజంగానే షోలో తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతుందా అన్నట్లుగా బిగ్ బాస్ ప్లాన్ ఉందని కొందరి అభిప్రాయం. హౌస్ లోని కంటెస్టెంట్ లో యష్మి గౌడ, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్ వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. కానీ మన తెలుగు సీరియల్స్ లో మీరు నటించడం మనం చూసాము. తెలుగు మాట్లాడడం వచ్చు కానీ పూర్తిగా స్వచ్ఛంగా తెలుగు మాట్లాడలేరు. అలాగే నైనిక అనే  డాన్సర్ కూడా చాలా రోజులుగా తెలుగు డాన్స్ షో, రియాల్టీ షోలు చేస్తుంది. సోషల్ మీడియాలో తెలుగు అమ్మాయని రాసుకొని వచ్చింది కానీ.. హౌస్ లో చూస్తే మాత్రం తెలుగు అమ్మాయిలాగా కనబడటం లేదు. అలాగే లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు హీరోగా పరిచయమైన ఆదిత్య ఓం కూడా చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు కనబడ్డాడు.

ఇప్పటికి కూడా తెలుగు చాలా ఇబ్బందిగానే మాట్లాడుతుండడం మనం చూడవచ్చు. అయితే తెలుగు షో లో మాట్లాడాలన్న గొడవ పడాలన్న సరే ఫ్లూయెంట్ గా తెలుగు వస్తే బాగుండేది. ఇలా వేరే భాషకు చెందిన వారిని తీసుకువచ్చి కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది వీళ్లకు అర్థం కాక వీళ్ళు చెప్పింది వాళ్లకు అర్థం కాక ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా మనం చాలానే చూసాం. అంతేకాకుండా వీళ్ళలో ఎవరైనా వేరే భాషలో మాట్లాడుకున్నా సరే తెలుగులో మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ సూచనలు ఇస్తూనే ఉంటారు. వేరే భాషలలో బిగ్ బాస్ షోలో మనం గమనిస్తే మాత్రం ఆయా ప్రాంతాలకు చెందిన వారే ఉంటారు తప్ప తెలుగులో మాత్రం ఒక్కరు కూడా కనిపించరు. అయితే ఈ క్రమంలో ఈ సీజన్ పాల్గొన్న 14 మంది కంటెస్టెంట్ లో ఆరుగురు వేరే భాషకు చెందిన వాళ్లే ఉన్నారు. అయితే తెలుగులో సరైన కంటెస్టెన్సీ లేరా అంటూ , అలాగే నిర్వాహకలు కావాలనే ఇలా ప్లాన్ చేస్తున్నారా అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వీళ్లల్లో చివరి వరకు ఎవరు హౌస్ లో ఉండి టైటిల్ ను  సొంతం చేసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: