నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని నాని ఓదెల 2 అని సంబోధిస్తున్నారు. ఈ సినిమాని కూడా దసరా సినిమాని నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా గురించి అనేక ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఒక అలర్ట్ నోట్ రిలీజ్ చేసింది. అయితే, ఈ చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వస్తున్నాయి. కథ ఇదేనని, మూవీ ఇలా ఉంటుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 2) స్పందించింది.ఈ సినిమా మోస్ట్ వైలెంట్ గా ఉంటుందని చిన్నపిల్లలు తీసుకువెళ్లొద్దు అంటూ వస్తున్న రూమర్స్ పై మూవీ టీమ్ స్పందించింది. తాము చేసే అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని కోరారు కాగా సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో నాని తన తరువాతి సినిమాపై చేసిన వ్యాఖ్యలతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి, అని తెలుస్తుంది.

నాని - ఓదెల ప్రాజెక్ట్ గురించి ఎలాంటి రూమర్లు వ్యాప్తి చేయవద్దని, దీనివల్ల ఎగ్జైట్‍మెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుందని మూవీ టీమ్ సూచించింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎస్‍ఎల్‍వీ సినిమాస్ ఈ మేరకు సోషల్ మీడియాలో నేడు ఓ నోట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం నుంచి తము తీసుకొచ్చే ప్రతీ అప్‍డేట్, కంటెంట్ బెస్ట్‌గా ఉండేలా చాలా జాగ్రత్తతో తీసుకొస్తామని తెలిపారు.
నాని - ఓదెల చిత్రాన్ని ప్రతీష్టాత్మకంగా రూపొందిస్తున్నామని, ఈ చిత్రం గురించి ఎలాంటి లీక్స్, రూమర్లు వ్యాప్తి చేయవద్దని మూవీ టీమ్ కోరింది. ఇలాంటివి చూస్తున్నప్పుడు బాధగా ఉంటోందని పేర్కొంది. "నానిఓదెల్ 2 ప్రాజెక్ట్ మాకు చాలా ప్రతిష్టాత్మకమైనది. అలాగే ఇండియన్ సినిమాలో మోస్ట్ యాంటిసిపేటెడ్‍గా ఉంటుంది. ఇలాంటి చిత్రంపై రూమర్లు, లీక్‍లు వస్తుండటం చాలా బాధగా అనిపిస్తోంది. ఇలాంటివి సినిమాపై ఎగ్జైట్‍మెంట్ చంపేస్తాయి" అని మూవీ టీమ్ పేర్కొంది.నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్‌గానే ఉండనుంది. ఈ చిత్రంపై మార్చిలోనే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు ఓదెల ప్రస్తుతం బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదని తెలుస్తోంది. నాని లైనప్‍లో హిట్ 3 మూవీ కూడా ఉంది. దీంతో ఈ రెండింట్లో ఏది ముందుగా పూర్తవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: