మెగా అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా తెలియజేశారు.. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అల్లు అరవింద్ కొడుకు అర్జున్ చాలా ఫన్నీగా ఉంటారని ఇటీవల పుష్ప-2 సినిమా షూటింగ్ సెట్ కి వెళ్లాను అక్కడ బన్నీ డైరెక్టర్ సుకుమార్ తో చాలా సేపు మాట్లాడానని.. అల్లు అరవింద్ గారి కోసమే అన్ స్టాపబుల్ షో చేశానని కూడా తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ఈమధ్య కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల కలవలేక పోతున్నారని తెలిపారు.
ఏది ఏమైనా సినిమా ఈవెంట్లో కలిసినప్పుడు చాలా సరదాగా అందరితో కలిసి మెలిసి ఉంటామని బాలయ్య తెలియజేశారు. బాలయ్య చేసిన వాక్యాలు మెగా అల్లు అభిమానులకు కాస్త ఆనందాన్ని ఇచ్చినప్పటికీ ఈ రెండు ఫ్యామిలీల విభేదాల పైన మరింత క్లారిటీ రావాలి అంటే కనీసం ఈ రెండు కుటుంబాలు కలిసి ఒక ఫోటో ఏదైనా మెగా కుటుంబం నుంచి వస్తే బాగుంటుందని అభిమానులైతే భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెగా హల్లు అభిమానులు అయితే సోషల్ మీడియాలో అసభ్య పదాలతో మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది.