తెలుగు ఇండస్ట్రీలో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం అనేక మలుపులు తిరిగిన సంగతి అందరికీ విధితమే. అయితే ఈ విషయంపై లావణ్య పోలీసులను ఆశ్రయించి 2008 నుంచి తనకు రాజ్ తరుణ్ తో పరిచయం ఉందని , 2014 లో పెళ్లి కూడా చేసుకుంటానని, 2016 లో గర్భం దాల్చిన అబార్షన్ కూడా చేయించాడని పోలీసులతో తెలియజేసింది లావణ్య. అయితే., హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పరిచయమయ్యాక తనను దూరంగా పెడుతున్నాడని లావణ్య తన ఫిర్యాదులు తెలియజేసింది. అనంతరం ఇదే విషయాన్ని మాల్వీ మల్హోత్రా ప్రశ్నిస్తే ఆమె బ్రదర్ తనను బెదిరించారని ఆరోపణలు చేసింది.

 అయితే., ఈ తరుణంలో రాజ్ తరుణ్ తో పాటు మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడిపై పోలీసు కేసు నమోదు చేశారు. అలాగే మాల్వీ మల్హోత్రా కూడా లావణ్య పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అయితే ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ కు ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.
 అయితే., ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం కోర్టులో ఉందని అక్కడ  నిరూపించుకుంటానని ఓ పాడ్ కాస్ట్ లో ఇటీవల నే తెలియజేశారు. అంతేకాకుండా మీడియా ముందు  వచ్చి ఆ వ్యవహారం పై మాట్లాడటం నాకు నచ్చదని తెలియజేశారు.


ఇది ఇలా ఉండగా.. తాజాగా రాజ్ తరుణ్ సినిమా భలే ఉన్నాడే అనే సినిమా ఈవెంట్ ప్రమోషన్ లో రాజ్ తరుణ్ కు ఒక చిక్కు ప్రశ్న ఎదురయింది.. లావణ్య వ్యవహారం గురించి తనకు మాట్లాడడం ఇష్టం లేదని ఆ విషయంపై ఇక ప్రశ్నలు అడగవద్దని మీడియాను కోరాడు.  న్యాయపరంగా తాను కోర్టులో కేసు గెలుస్తానాని రాజ్ తరుణ్ తెలియజేశారు. కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు తాను ఆమె గురించి మాట్లాడను అంటూ రాజ్ తరుణ్ తెలియజేశాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజ్ తరుణ్ సినిమాల విషయానికి వస్తే 40 రోజులలో రాజ్ తరుణ్ తీసిన రెండు సినిమాలు రిలీజ్ కాదా సెప్టెంబర్ 13న భలే ఉన్నాడే అని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాను శివ సాయి వర్ధన్ తెరకెక్కించగా కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మనీషా కంద్కూర్‌ నటించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: