టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తూ, తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ తన నటన, కామెడీ టైమింగ్ తో మాత్రమే ప్రేక్షకులను అలరించే అల్లరి నరేష్ ఎమోషనల్ క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల బ్రేక్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ తన కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.


తన తండ్రి ఈవివి సత్యనారాయణ అండదండలతో, అల్లరి నరేష్ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ తరహాలో కామెడీ చిత్రాలతో అల్లరి నరేష్ దూసుకుపోయాడు. అల్లరి నరేష్ కు గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి హిట్ పడడం లేదు. ఇక ఇప్పుడు సెంటిమెంట్, కామెడీ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా.... అల్లరి నరేష్ కు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్త ఓ వైరల్ అవుతుంది.


తన కెరియర్ ప్రారంభంలో నరేష్హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడిపించారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, సీమశాస్త్రి వంటి సినిమాల్లో అల్లరి నరేష్ తో కలిసి హీరోయిన్గా నటించిన ఫర్జానాతో నరేష్ ప్రేమాయణం కొనసాగించాడని అప్పట్లో ఓ వార్త వైరల్ అయింది. అల్లరి నరేష్ కెరీర్ సినిమాల పరంగా అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎంతో బాగుందని, ఇక వరుసగా అల్లరి నరేష్ కు ఫ్లాప్స్ ఎదురవడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయట.

ఈ విషయం అల్లరి నరేష్ కుటుంబ సభ్యుల వరకు వెళ్లిందట. దీంతో 2017 సంవత్సరంలో విరూపా అనే అమ్మాయితో తన కుటుంబ సభ్యులు వివాహం జరిపించారట. వివాహ అనంతరం అల్లరి నరేష్ ఎలాంటి ఎఫైర్స్ జోలికి వెళ్లలేదట. ప్రస్తుతం అల్లరి నరేష్ ఓవైపు సినిమాలతో, మరోవైపు తన కుటుంబంతో కలిసి హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: