అల్లూ శిరీష్ నటించిన బడ్డీ కోసం టికెట్ రేట్లు తగ్గించిన ఫలితం దక్కలేదు. రెండోవారం ఏకంగా 10 సినిమాలు వచ్చాయి. మూడో వారంలో ఆగస్టు 15 కానుకగా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ లాంటి సినిమాలు ఉండడంతో కచ్చితంగా ఈ రెండు సినిమాలలో ఒకటయిన సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ.. రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే అదే రోజు రిలీజ్ అయిన విక్రమ్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా తంగలాన్ మాత్రం ఓవర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే రెండో వారంలో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కోసం నిహారిక తనకున్న పరిచయాలు అన్ని వాడేసింది.
విజయ్ ఆంటోని చేసిన తుఫాన్ సినిమా డిజాస్టర్. డబ్బులు ఇస్మార్ట్ డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ ఆశలు అడియాసలు అయ్యాయి. ఆశ్చర్యకరంగా ఆగస్టు 15న బరిలో నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నటించిన ఆయ్ సినిమా హిట్ అయింది. తక్కువ బడ్జెట్ తో తీసి పక్క ప్రమోషన్ తో రిలీజ్ చేసిన ఈ సినిమా ధియేటర్లలో ఆడియన్స్‌కు నవ్వులు పుయించింది. ఆ తర్వాత వారం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రిలీజ్ అయింది. రావు రమేష్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇక ఆగస్టు చివరివరంలో నాని నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అయింది.
ఈ సినిమా మూడు రోజుల్లోనే 50 కోట్లకు పైగా గ్లాస్ వసూళ్ళు సాధించి మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా పూర్తి రిజల్ట్ మరో నాలుగు రోజులు ఆగితే కానీ తెలియదు. అయితే ఈ సినిమాకు వర్షాలు దెబ్బేసాయి. అలాగే ఆగస్టులో రీ రిలీజ్ల హడావుడి కూడా నడిచింది. మహేష్ బాబు మురారి. చిరంజీవి ఇంద్ర. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలు మళ్లీ వచ్చాయిజ ఇంద్ర సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. మురారి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఆగస్టు నెలలో కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి.