నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో రెండు హిట్ చిత్రాలను అందించిన నాని, తాజాగా సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పుడు మరొక చిత్రంతో ఆడియెన్స్ ను స్టన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.నేచురల్ స్టార్ నాని కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలా ఛాన్స్ ఇచ్చి గతేడాది వరుసగా రెండు సినిమాలతో హిట్లు అందుకున్నాడు. అందులో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తన కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమా కూడా ‘దసరా’నే కావడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత అదే జోష్‌లో మరో కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో ‘హాయ్ నాన్న’ సినిమా తీశాడు.ఈ సినిమా కూడా మంచి హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా కొత్త దర్శకులకు ఛాన్స్‌లు ఇచ్చి మంచి హిట్లు అందుకుంటున్నాడు. అయితే నాని ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు అతడు రైటర్‌గా కూడా మారినట్లు తెలుస్తోంది. నాని ఓ సినిమాకి స్టోరీ లైన్ ఇచ్చారని తెలుస్తోంది. అదే ‘హిట్3’. దీంతో నాని ఇచ్చిన ఆ స్టోరీ లైన్‌తోనే డెవలప్ చేసి శైలేష్ కొలను స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ మరియు హిట్ 2 చిత్రాలు మంచి సక్సెస్ ను సాధించాయి. హిట్ 3 కూడా కన్ఫర్మ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నాని హీరోగా నటించబోయే ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శైలేష్‌ కొలను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తూ క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కించిన చిత్రం హిట్‌. ఈ ప్రాజెక్ట్‌ ప్రాంచైజీలో వచ్చిన హిట్‌ 2 కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ఈ సారి న్యాచురల్‌ స్టార్ నాని తో హిట్‌ 3 ఉండబోతుందని శైలేష్‌ కొలను ఇప్పటికే ప్రకటించేశాడు. చాలా రోజుల తర్వాత హిట్‌ 3కి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.కాగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’లో విశ్వక్ సేన్ నటించి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘హిట్ 2’లో అడివి శేష్‌ని పెట్టి తెరకెక్కించి మరింత హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హిట్ 3లో నాని హీరోగా నటిస్తున్నాడు. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నటించబోతున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం నాని చిన్న స్టోరీ లైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని దర్శకుడు డెవలప్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో కమ్ నిర్మాత రానా దగ్గుబాటి ఈ మూవీలో విలన్ పాత్ర చేయబోతన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. క్రైం థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ పాత్రలో నాని కనిపించనున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ ఓదెలతో సినిమాను సమాంతరంగా పూర్తి చేస్తారని టాక్.అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: