జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ సినిమా నుంచి మోస్ట్ అప్డేట్లను సైతం విడుదల చేస్తూనే ఉంది చిత్ర బృందం. ఈ సినిమా కోసం అభిమానులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రస్తుతం జరగడం జరిగింది. దేవర చిత్రంలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయి కథ ఎలా ఉంటాయని విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ ఎన్టీఆర్ లుక్స్ కు సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి.


చిత్రానికి సంబంధించి ఒక స్టోరీ లైన్ టాలీవుడ్లో తెగ వైరల్ గా మారుతున్నది. దేవర సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దేవర సినిమాలోని కొంత భాగం నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారట. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది ప్రజల జీవితాల పైన చాలా ప్రభావం చూపించిందని సమాచారం. గతంలో కూడా శ్రీమంతుడు ,ఆచార్య వంటి సినిమాలలో కూడా కొంతమేరకు నిజజీవితంలో జరిగిన సంఘటనలు తీసుకోవచ్చారు. అలా ఇప్పుడు దేవరలో కూడా వాస్తవ సంఘటన ఆధారంగానే కథ ఉండబోతున్నట్లు సమాచారం.


1985లో ఆంధ్రప్రదేశ్లో కారంచేడు ఘటనలో జరిగిన ఒక సంఘటన ఆధారంగానే దేవర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దళితులపై జరిగిన హింస నేపథ్యంలోనే ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇందులో రెండు ముఖాలను చూపించడం జరిగింది. ఇందులో ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని.. బయటికి తగ్గట్టుగా ఫేసెస్ ఆఫ్ ఫియర్ అనే  ట్యాగ్ కూడా చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయ లో నటిస్తూ ఉండడమే కాకుండా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: