తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా అవకాశం వస్తే ఎవరు కాదంటారు. కానీ చిరంజీవితో సినిమా అవకాశం వచ్చిన సమయంలో బి గోపాల్ ఆ సినిమాను వద్దన్నాడట. అసలు ఎందుకు వద్దన్నాడు. ఆ తర్వాత ఆ సినిమా సెట్ అయ్యిందా ... లేదా అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా ఇంద్ర అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకొని ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

ఇంత గొప్ప విజయం అందుకున్న ఈ సినిమాను మొదట బి గోపాల్ చిరంజీవి తో తెరకెక్కించాలి అంటే భయపడ్డాడట. ఆ విషయాలను పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అసలు విషయంలోకి వెళితే ... పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ... అశ్విని దత్ , చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. చిరంజీవి అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బి గోపాల్ కూడా ఓకే అన్నాడు. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో సినిమా చేయాలి అనుకున్నారు. చిన్ని కృష్ణ , బి గోపాల్ కి ఆ కథను వినిపించాడు. కథ మొత్తం విన్న గోపాల్ ఈ సినిమా చేయొద్దు అనుకున్నాడట. ఇక పరుచూరి గోపాలకృష్ణ కు ఈ విషయం తెలిసి ఎందుకు నువ్వు చిరంజీవి తో ఆ కథతో సినిమా చేయను అన్నావు అని అడిగాడట.

దానితో నేను బాలకృష్ణ తో ఇప్పటికే సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. మళ్లీ దాదాపు అలాంటి కథతోనే సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందో లేదో అందుకే చేయలేను అని అన్నాడట. దానితో గోపాలకృష్ణ నువ్వు బాలకృష్ణ తో యాక్షన్ సినిమాలు చేశావు. చిరంజీవి తో కాదు. చిరంజీవి తో ఈ సినిమా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పాడట. దానితో కన్విన్స్ అయిన బి గోపాల్ , చిన్ని కృష్ణ చెప్పిన కథతో ఇంద్ర సినిమా చేయడం అది టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: