టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హేమ లాంటి కమిషన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కోరుతూ ఇటీవల వాస్ ఆఫ్ ఉమెన్ పేరుతో సంచలన పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అంతా ఈ అమ్మడు వేసిన పోస్ట్ గురించి చర్చించుకుంటున్నారు. తాజాగా, సమంతా కు సపోర్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ఇంస్టాల్ వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. "తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని మహిళలపైన మేము హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి మార్గం వేసిన WCC కేరళ ను అభిమానిస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల కోసం ఒక సపోర్ట్ గ్రూప్
'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' 2019 లో ఏర్పాటు చేయబడింది.సినీ పరిశ్రమ విధానాలు రూపొందించడంలో సహాయపడే లైంగిక వేధింపులపై సమర్పించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది" సమంత పెట్టిన పోస్ట్ షేర్ చేసింది. అయితే రోజు రోజుకు కాస్టింగ్ కౌచ్ వివాదం ముదురుతోంది తప్పు సద్దుమణగడం లేదు. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇద్దరూ స్టార్ యిన్లు కమిటీ వేయాలని కోరటంతో అంతా షాక్ కు గురవుతున్నారు.