తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలలో నటిస్తూ కెరియర్ను నటుడిగా ముందుకు సాగించాడు. అలాంటి సమయంలోనే ఈయన రవితేజ హీరోగా రూపొందిన ఆంజనేయులు మూవీ తో నిర్మాతగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమా తర్వాత బండ్ల గణేష్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ హిందీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లవ్ ఆజ్ కల్ అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందింది.

ఇక అప్పటికే హిందీ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తర్వాత బండ్ల గణేష్ , పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ అనే మూవీ చేశాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.  సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బండ్ల గణేష్ "తీన్ మార్" మూవీ గురించి మాట్లాడుతూ ఆ సినిమా అసలు ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికే అర్థం కావడం లేదు.

అది ఒక గొప్ప సినిమా. కొన్ని రోజుల క్రితమే ఆ సినిమాను మళ్ళీ చూశాను. చూస్తున్నప్పుడు ఆ సినిమా ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకోలేదా అని నాకు అనుకున్నాను. అసలు అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా. ఎందుకు సక్సెస్ కాలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే గబ్బర్ సింగ్ కి రీ రిలీస్ లో బాగంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: