సాధారణంగా ఎంతో మంది దర్శకులు ఒక హీరోను ఊహించుకుంటూ కథ రాసుకోవడం చేస్తూ ఉంటారు. ఇక ఆ హీరో యాక్షన్  చేస్తే ఎలా ఉంటుంది.. ఎమోషనల్ సీన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఊహగానంతోనే డైలాగులు కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు. కానీ తీరా ఈ స్టోరీ తీసుకువెళ్లి హీరో దగ్గర వినిపిస్తే కొంతమంది హీరోలు ఇక అలాంటి కథలను చేయడానికి ఇష్టపడక రిజెక్ట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని.. మరో హీరో చేసి హిట్టు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.


 సాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేస్తే మరో హీరో ఇక ఆ సినిమాను తెగ ఇష్టపడటం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారు. కానీ అదే స్టోరీ తో సినిమా తీసిన నందమూరి బాలకృష్ణ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేశాడు. దర్శకుడు కే మురళీమోహన్రావు చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో సంఘర్షణ అనే సూపర్ హిట్ సినిమా తీశాడు. మరోసారి మెగాస్టార్ తో సినిమా తీసేందుకు ఒక కథను కూడా రాసుకున్నాడు. పరుచూరి బ్రదర్స్ ఇక ఈ కథకు డైలాగ్స్ అందించారు.


 మూవీలో హీరో పాత్ర కంటే శారదా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. మెగాస్టార్ కి ఈ కథ నచ్చలేదు. వెంటనే తిరస్కరించాడు. ఆ తర్వాత ఇదే సినిమాను కృష్ణతో చేయాలని అనుకుని కథ వినిపించగా కృష్ణ అప్పటికే బిజీగా ఉండడంతో కుదరక ఈ సినిమాను వద్దనుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో హీరో పాత్ర తనకు నచ్చలేదు అంటూ చెప్పేశాడు. ఆ తర్వాత సుమన్ కృష్ణంరాజు దగ్గర నుంచి రమేష్ బాబు వరకు ఈ కథ తిరిగింది. చివరగా దర్శకుడు మురళీమోహన్రావు బాలయ్యను కలిశాడు. ఆయన కూడా రిజెక్ట్ చేస్తే కథను పక్కన పడేయాలని అనుకున్నాడు. కానీ బాలయ్యకు కథ చెప్పగా ఆయనకు బాగా నచ్చింది. విజయశాంతిని హీరోయిన్గా పెట్టి సినిమాను పట్టలెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఇదే సినిమాని హిందీలో మిథున్ చక్రవర్తి, మీనాక్షి శేషాద్రితో దిల్వాల పేరుతో తీయగా అక్కడ యావరేజ్ గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు కథనాయకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: