బిగ్బాస్ సీజన్ 8 ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే.. ప్రతి సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా సాగింది. హౌస్ మేట్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ తమకు నచ్చని వాళ్లను నామినేట్ చేశారు. ఇక మొదటివారం నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ గా నిఖిల్, నైనిక, యష్మీ గౌడ గా నియమితులయ్యారు. దీంతో వారి ముగ్గురికి కూడా నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ సొంతం చేసుకున్నట్లు బిగ్ బాస్ తెలియజేశారు .అంతే కాకుండా నామినేషన్ లో ప్రక్రియ భాగంగా ఒక్కో కాంటెస్ట్ ఇద్దరినీ నామినేట్ చేస్తే అందులో ఒకరిని ఈ ముగ్గురు సెలెక్ట్ చేస్తారు.

ఈ క్రమంలో ఆరుగురు నామినేషన్ ప్ లిస్ట్ లో ఉన్నారు. మొదటివారం నామినేషన్ లిస్టులో 1. నాగ మణికంఠ 2. బెజవాడ బేబక్క 3. పృథ్వీ రాజ్ 4. సోనియా ఆకుల 5. విష్ణు ప్రియ 6. శేఖర్ బాషా వీరు ఉన్నారు. అయితే ప్రతి సీజన్లో గా లాగానే  ఫస్ట్ వీక్ నామినేషన్లు అందరూ చెప్పే కారణం ఏమిటి అంటే సరిగ్గా హౌస్ మేట్స్ తో  కలవడం లేదని.. ఇదే కారణం తోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ దాదాపు ముకుమ్మడిగా మణికంఠను నామినేట్ చేశారు. అలాగే నామినేషన్స్ లిస్టులో మణికంఠకు ఎక్కువ ఓట్లు పడ్డాయి.


ఇది ఇలా ఉండగా ఈ నామినేషన్ ప్రక్రియ మొత్తం చూడగా మొదటి వారం ప్రధానంగా ఇద్దరు పైనే దృష్టి సాధించినట్లు తెలుస్తుంది.. ఒకరు మణికంఠ అయితే మరొకరు బెజవాడ బేబక్క. ఇది ఇలా ఉండగా మరోవైపు మొదటివారం ఇంటి నుండి బెజవాడ బేబక్క బయటికి వెళ్ళవచ్చు అని కొందరి అభిప్రాయం. ఇందుకు గల కారణం ఏమిటి అంటే ఫస్ట్ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు తొలి వారంలో ఎలిమినేట్ అయిన వాళ్ల విషయానికి వస్తే సింగర్ కల్పన, నటి హేమ, కరాటే కళ్యాణి, షకీలా వీళ్ళందరూ కూడా ఓకే ఏజ్ గ్రూపు వాళ్లే.  అలాగే నామినేషన్ ఓటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం విష్ణు ప్రియా టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. మరోవైపు బెజవాడ  బేబక్క మాత్రం తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: