ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరి కొంతమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వరద బాధితులను అందుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయనిధికి తాజాగా యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రూ.15 లక్షల చప్పున మొత్తం 30 లక్షల రూపాయలు అందించారు. 'తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం.
ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టంలోకి నెట్టేసాయి. ఇలాంటి సమస్యల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అత్యవసరం. వరద బాధితులకు నా వంతు సహకారం గా 30 లక్షల ఆర్థిక సహాయాన్ని (15 లక్షలు ఆంధ్రప్రదేశ్ కి,15 లక్షలు తెలంగాణకు) వరద సహాయవిధికి ప్రకటిస్తున్నాను. ఇది కొంతమందికి అయితే ఏదో ఒక విధంగా ఉపయోగపడుతోందని ఆశిస్తున్నాను' అని హీరో సిద్దు జొన్నలగడ్డ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఎవరైనా సహాయం చేయాలనుకున్నా వారు కూడా తప్పకుండా సహాయం చేయండి అంటూ సిద్దు చెప్పుకొచ్చాడు.