దక్షిణాది సిని ఇండస్ట్రీలోని హీరోయిన్ సాయి పల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. తన గ్లామర్ తోనే కుర్రకారులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు పూర్తిగానే దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మ ఎంచుకొనే ప్రతిపాత్ర కూడ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.అందుకే ఈ ముద్దుగుమ్మ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించడమే కాకుండా స్పెషల్ హీరోయిన్గా కూడ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇటీవలే తన పెళ్లి విషయం గురించి పలు విషయాలను వెల్లడించింది.


యాంకర్ ఇప్పటి వరకు మీరు ప్రేమలో పడలేదా అని అడగగా.. అందుకు సాయి పల్లవి మహాభారతి ఇతిహాసం అంటే తనకు చాలా ఇష్టమని అందులో ఉండే అభిమన్యుతో తాను ప్రేమలో పడ్డానని తను అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. గత 10 ఏళ్లు గా అభిమన్యుడు పాత్ర గురించి తాను ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నట్లుగా తెలియజేసింది సాయి పల్లవి. అందుకే అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా సరే తనలో ఆసక్తిని పెంచుతాయి అంటూ తెలియజేసింది.


అంతేకాకుండా గత 10 ఏళ్లుగా ఆయనతో ప్రేమలో ఉన్నానంటూ చాలా స్మైలీగా తెలియజేసింది సాయి పల్లవి.. అయితే ఈ విషయాలు విన్న అభిమానులు సైతం ఆశ్చర్యపోయిన మహాభారతం అంటే తనకు ఇష్టమని చెప్పడంతో మరికొంతమంది విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే తెలుగులో నాగచైతన్యతో తండేల్, హిందీలో రామాయణ, తమిళంలో అమరన్ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నది.. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి తాను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తన వృత్తి అయిన డాక్టర్ కోర్స్ పూర్తి చేసి వైద్యురాలు కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులైతే సినిమాలలో నటించమని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: