వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నానికి దగ్గరలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడ, ఖమ్మం లాంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు అన్ని కోల్పోయారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఏపీ, తెలంగాణకు విరాళాలు

 ప్రకటిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటిస్తూ పోస్ట్ చేసారు. ఎన్టీఆర్ తన పోస్ట్ లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని తెలిపారు. అంతేకాదు టాలీవుడ్ క్రేజీ హీరో

 సిద్దూ జొన్నలగడ్డ సైతం ఏకంగా రూ.30 లక్షల భారీ విరాళం ఇచ్చాడు. ఏపీకి రూ.15 లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు ఇచ్చాడు.  తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు నాగవంశీ, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.50 లక్షల ఆర్థిక సహయం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతుండటంతో తమ వంతుగా సహయం చేస్తున్నామని తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: