అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా పుకార్లు షీకార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి ఇద్దరూ వేర్వేరు హాజరయ్యాక ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. దీనికి తోడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘గ్రే డైవర్స్’కు (50 ఏళ్లు పైబడినవారు విడాకులు తీసుకోవడం) సంబంధించిన పోస్టుకు అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టడంతో విడాకుల అనుమానాన్ని మరింత బలపరిచింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 2011లో వారికి ఆరాధ్య పుట్టింది. కాగా ఈ ఏడాది

 ఏప్రిల్ నెలలో 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి ఫొటోలను ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కాగా వివాహానికి ముందు గురు, ధాయ్ అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, ధూమ్-2, ఉమ్రావ్ జాన్ సినిమాలలో ఇద్దరూ జంటగా నటించారు. ఇక అభిషేక్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ఇంటికి తన కూతురితో కలిసి ఐశ్వర్య రాయ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ముంబయిలోని అమితాబ్ స్వగృహం 'జల్సా'కి కూతురుతో కలిసి వచ్చిన ఐశ్వర్య ముఖంలో ఎలాంటి

 నవ్వు కనిపించలేదు. ఐశ్వర్య, ఆరాధ్య ఇంటి బయట కారు దిగి లోపలికి వెళ్లారు. ఆరాధ్య స్కూల్ యూనిఫాంలోనే కనిపించగా, ఐశ్వర్య ఆకుపచ్చ రంగు దుస్తుల్లో కనిపించింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐశ్వర్య రాయ్‌తో విడాకుల రూమర్స్‌పై అభిషేక్ బచ్చన్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ కొన్ని రోజుల క్రితం అభిషేక్ బయటకు వచ్చినప్పుడు అతని చేతి వేలికి ఐశ్వర్య రాయ్ తొడిగిన ఉంగరం కనిపించలేదు. దాంతో విడాకుల వార్తలకి బలం చేకూరింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: