ఇక స్టార్ హీరోల మూవీస్ లో ఇక ఒక్కో సినిమాలో హీరో పాత్రలకి ఒక్కో రకమైన పేరు ఉండటం చూస్తూ ఉంటాము. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు ఇక హీరో పాత్రకి ఒకే ఒక పేరు పెట్టాలని దర్శక నిర్మాతలు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారేమో అని అనుమానం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఏ సినిమాలో చూసుకున్న హీరో పాత్రకి ఒకే రకమైన పేరు ఉంటుంది. అదే దేవ. ఇక ఈ పేరుకి ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది అని చెప్పాలి. ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా స్టార్ హీరో పాత్ర పేరు దేవా అని ఉండటం కనిపిస్తూ ఉంది.
ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీలో ప్రభాస్ పాత్ర పేరు దేవా. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర మూవీ లో ఎన్టీఆర్ పాత్ర పేరు దేవా. ఇక ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ మూవీలోను రజనీకాంత్ నటిస్తున్న పాత్ర పేరు దేవా కావడం గమనార్హం. ఇటీవల చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో దేవా అనే పాత్రకి బాగా డిమాండ్ ఏర్పడింది అంటూ ఇంటర్నెట్ జనాలు కామెంట్లు చేస్తున్నారు.