మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ మరియు అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమా విడుదలకు కేవలం 25 రోజులు మాత్రమే సమయం వుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది.. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు సాంగ్స్ రిలీజ్ చేసారు .. ‘దూకే దైర్యమా జాగ్రత్త’ అంటూ సాగే మాస్ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అలాగే రీసెంట్ గా ఈ సినిమా నుండి ‘చుట్టమల్లె’ అంటూ రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ రొమాంటిక్ సాంగ్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయింది.. 

రికార్డ్ వ్యూస్ తో చుట్టమల్లె సాంగ్ దూసుకుపోతుంది.విడుదల చేసిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. దీనితో ఈ సినిమా నుండి వచ్చే మూడో సాంగ్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి…స్టార్ లిరిక్ రైటర్ అయిన రామజోగయ్య శాస్త్రి మూడో సాంగ్ భీబత్సం సృష్టిస్తుంది అని హింట్ ఇవ్వడంతో ఈ సాంగ్ పై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇదిలా ఉంటే ఈ మూడో సాంగ్ మేకర్స్ తాజాగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య సాగే ఈ మాస్ డ్యూయెట్ ను మేకర్స్ సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, జాన్వీ లుక్స్ అదిరిపోయాయి.ఇదిలా ఉంటే ”దావుడి” అంటూ సాగే రేపు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ట్వీట్ చేసారు..ఈ సాంగ్ లోని చిన్న బీట్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.పక్కా బ్లాక్ బస్టర్ సాంగ్ గ్యారెంటీ అంటూ రాసుకొచ్చారు..మరి ఈ పాట ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: