తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో కమెడియన్ ఫిష్ వెంకట్ కూడా ఒకరు.. హైదరాబాదులోనే పుట్టి పెరిగి తన నటనతో ప్రత్యేకమైన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. 2000 సంవత్సరంలో సమ్మక్క సారక్క అనే చిత్రం ద్వారా మొదటిసారిగా ఫిష్ వెంకటేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో వందలాది చిత్రాలలో కమెడియన్ గా కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు.. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రంలోని తొడగొట్టి చిన్న అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ తో భారీ క్రేజ్ అయితే అందుకున్నారు.


అలా ఫిష్ వెంకటేష్ గత ఏడాది చివరిగా విడుదలైన నరకాసుర అనే చిత్రంలో నటించారు.. అయితే తాను కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ అందుకు గల కారణాన్ని ఇటీవల వివరిస్తూ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని తన కుటుంబం కూడా దీనస్థితిలోకి వెళ్లిపోయిందని ఎవరైనా దాతలు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇటీవలే ఆయాసం ఎక్కువగా వస్తోందని ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఒక వారం రోజులపాటు తనకి చికిత్స అందించి డయాలసిస్ చేశారని తెలియజేశారు.



సుమారుగా ఒక ఏడాదిన్నర కాలం పాటు డయాలసిస్ చేయించుకుంటున్నానని నాలుగేళ్ల క్రితమే తన కాలికి ఒక చిన్న దెబ్బ తగిలింది ఆ సమయంలో బీపీ, షుగర్ కూడా రావడంతో కాలు చాలా ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు కూడా తన కాలికి ఆపరేషన్ చేశారని తెలియజేశారు ఫిష్ వెంకటేష్. అప్పటినుంచి తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అని రెండు కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం తాను ఇంటి దగ్గరే ఉన్నట్టుగా తెలిపారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా సినిమా అవకాశాలు వచ్చిన చేయలేకపోయానని డబ్బులు లేకపోవడంతో ప్రస్తుతం తన పరిస్థితి వైద్యం కూడా చేయించుకోలేనట్టుగా మారిపోయింది అని తెలిపారు. అయితే ఈ విషయం విన్న అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: