మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వరద ప్రాంతలను చూసి చలించిపోయి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇక సీఎం చంద్రబాబు కూడా అక్కడ పరిస్థితిని పరిశీలిస్తే ప్రజలను భయపడవద్దంటూ సూచనలు ఇస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలను తెలియజేయకపోవడంతో చాలా మంది డిప్యూటీ సీఎంని విమర్శించారు. దీంతో హీరోయిన్గా పేరుపొందిన పూనమ్ కౌర్ కూడా ట్విట్టర్ వేదికగా ఒక సంచలన పోస్ట్ చేసింది.
ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు రావాల్సింది బయట ప్రజల వద్ద లేకపోతే కేవలం అలాంటి నాయకులు మాటల నాయకుడు చేత కానీ నాయకుడిగా మిగిలిపోతారు ఇలాంటి లీడర్ అవకాశవాది అవుతారు అంటూ ఒక ట్విట్ చేసింది పూనమ్ కౌర్..ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారంటూ పలువురు నెటిజెన్స్ తెలియజేశారు. దీంతో పవన్ అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఆమెను ఫాన్స్ తిడుతూ ఉన్నారు..కానీ ఈ విషయం నిన్నటి రోజున మధ్యాహ్నం పూనమ్ కౌర్ ట్వీట్ చేయగా సాయంత్రానికి పవన్ కళ్యాణ్ తాను వార్త బాధిత ప్రాంతాలకు రాకపోవడానికి కారణాన్ని తెలియజేస్తూ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగే పలు రకాల టోల్ ఫ్రీ నెంబర్లను కూడా తెలియజేయడం జరిగింది.